దానగుణం లేకపోవడం.;-తాటి కోల పద్మావతి. గుంటూరు

 దాన గుణం లేని వాడిని ఎంతగా పొగిడినా వాడు దాతకాలేడు.
గడ్డి పోచను పెరికి గంగానదిలో ముంచి తెచ్చిన అది యజ్ఞానికి ఉపయోగపడే దర్భ కాలేదు.
పొగడ్తల వల్ల లేని గుణం రాదు. ఉన్న గుణం పోదు. దర్భ గడ్డి జాతికి చెందినదే. గడ్డి పరికను పవిత్ర గంగాజలంలో ముంచి తెచ్చినంత మాత్రాన దానికి పవిత్రత ఏర్పడి, దర్భవలె యజ్ఞ యాగాల్లో ఉపయోగపడదు. కనుక ఏమి చేసినా దేని గుణం, ప్రభావం ప్రశస్థి దానికే ఉంటుంది కానీ మార్పు రాదు. లోభిని ఎంత పొగడినా వాడు దాతకాలేడు కదా. కనుక సహజంగా కొంచెమైనా మంచితనం ఉంటే అది పదిమందికి పొగడినప్పుడు క్రమంగా పెరుగుతుంది. పొగడ్తల కోసం కాకుండా సహజంగానే దానం ధర్మం లాంటి మంచి గుణాలు బాల్యం నుంచి అలవరచుకోవాలి.
కామెంట్‌లు