ఆదర్శ విద్యాలయంలో మెరసిన ముత్యాల హారాలు;-రాథోడ్ శ్రావణ్‌
 నన్నయ్య ఉపకథలు
తిక్కన్న నవరసాలు
ఎర్రన్న వర్ణనలు
భారతాన కోకొల్లలు
మహాభారతంలోని పర్వాలు రచించిన కవిత్రయం గుర్చి కవి అద్భుతంగా చేప్పారు. 
వెలుగునిచ్చే దీపాలు
జ్ఞానమిచ్చు పుస్తకాలు
మారిపోవు మస్తకాలు
ఆనందమె జీవితాలు
కవి పుస్తక పఠనం వలన లభించే జ్ఞానమును తెలియజేశారు.
తెలంగాణ ఆదర్శ పాఠశాల జనగాం జిల్లా బచ్చన్నపేటలో తెలుగు భాషోపాధ్యాయులుగా  విధులు నిర్వర్తిస్తున్న కవి, రచయిత,విశ్వవిద్యాలయంలో లెక్చరర్ షిప్ కోసం జరిగే    యూజీసీ నెట్,సెట్ పరీక్ష యందు ఉత్తీర్ణులై
ఎం,ఏ. తెలుగు సాహిత్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల హైదరాబాదు నుండి 2007లో
 సురవరం ప్రతాపరెడ్డి స్వర్ణ పతకం సాధించిన ఉన్నత విద్యావంతుడు మీసాల సుధాకర్ గారు   తెలుగు సాహిత్యంలో నూతన లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారంలో దాదాపు ఏడు వందల    పైచీలుకు ముత్యాల హారాలు లిఖించి "సాహితీ ముత్యాల హార పురస్కారం" పొంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తి వంతులవుతున్నారు.
చాలా చక్కని సరళమైన పదజాలంతో ఆకర్షణీయమైన అంత్యానుప్రాసతో అద్భుత రచనలు చేయగల చేయి తిరిగిన కవి మీసాల సుధాకర్ జనగామ జిల్లా రఘు నాథపల్లి మండలంలోని  ఖిలాషాపురం గ్రామంలో శ్రీమతి/శ్రీ, కీ.శే.మీసాల రామయ్య , సోమక్క దంపుతులకు 09‌ జూన్1977‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. జీవిత భాగస్వామి పేరు స్వప్న వీరికి సాయి నిఖిల్, సాయితేజ ఇద్దరు కుమారులు ఉన్నారు.
వృత్తి రీత్యా తెలుగు భాషోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తూ ప్రవృత్తి రీత్యా సాహితీ సృజనకారుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.సాహితీ సృజన కవితలు, మధురిమలు, గేయాలు రాస్తూ, విద్యార్థులలోని దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడం మాతృభాష పై మమకారం పెంపొందించడం
పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్య భూమిక పోషిస్తూన్నారు.సాహిత్యం మీద ప్రేమతో తొలి పొద్దు బాలల కవితల సంకలనం-2021 కి సంపాదకత్వం వహించారు. మీసాల సుధాకర్  అణిముత్యాలు పేరుతో ముత్యాల హారాల సంపుటిని మన ముందుకు తీసుకొచ్చారు. ఇది వారి తొలి కవితా సంపుటి కావడం విశేషం.
ఈ సంకలనం వివిధ సామాజిక, సమకాలీన అంశాల పై వెలువరించడం గొప్ప విషయం.మాతృభాషాభిమానంతో సాహిత్యాన్ని ఎంచుకొని సాహితీ రంగంలో విద్యార్థులను, పాఠకులను, రచయితలను, ప్రోత్సహిస్తు సాహిత్యంలో సేవ చేస్తూ 2020 లో విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బండారు బాలానంద సంఘం వారిచే "ప్రతిభా పురస్కారం" ఉట్నూరు సాహితీ వేదిక ఆదిలాబాద్ జిల్లా వారిచే "సాహితీముత్యాల హార పురస్కారం" అందుకున్నారు.
తెలుగు పండితులు ఆయన యువకవి మీసాల సుధాకర్ తెలుగు సాహిత్య ప్రక్రియను
అలవోకగా వ్రాయగల దిట్ట.
 "ముత్యాలహారం"  నూతన కవిత ప్రక్రియలో  ఆణిముత్యాలు -ముత్యాల హారాలు
అను పేరుతో మొత్తం నాల్గు వందల నలభై ముత్యాల హారాలతో పుస్తకములో రూపొందించడం సంతోషం. ఈ పుస్తక సాగరంలో ఎన్నో ఆణిముత్యాలాంటి ముత్యాల హారాలు కలవు.
తెలుగు సాహితీ క్షేత్రంలో అందనంత ఎత్తుకు ఎదుగుతున్న ఈ యువకవి
తెలుగు భాష ప్రచారం,ప్రసారం కొరకు తన వంతు కృషి చేస్తూ, తెలుగు తల్లికి ఎనలేని సేవలందిస్తూ,
అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అందమైన అంత్యానుప్రాసలతో  ఆకట్టు కుంటున్న చక్కని ముత్యాల హారాల రచన ఇది. ముత్యాల హారాలు రాస్తూ ముందుకు దూసుకుపోతున్న కవి
కలం నుంచి మరిన్ని పుస్తకాలు వెలుగులోకి రావాలని ఉట్నూర్ సాహితీ వేదిక తరుపున మనసార కోరుతూ, తెలుగు సాహిత్యానికి మీసాల సుధాకర్ చేస్తున్న కృషి అభినందనీయం.
వెల:80/-
ప్రతులకు
మీసాల స్వప్న
ఇం.సం:4-6-22/3-4
సి.ఆర్.రెడ్డితోట, జనగామ జిల్లా 9908628430
సమీక్షకులు
రాథోడ్ శ్రావణ్‌ 
ముత్యాలహారం రూపకర్త,
ఉసావే పూర్వ అధ్యక్షులు,
ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా
సెల్:9491467715.


కామెంట్‌లు