1. ఈతి బాధ ష ట్కం -అంటే ఆరు.
అతివృష్టి, అనావృష్టి, శలభములు, మూషికములు, శుకములు, ప్రమాదకరమైన రాజులు.
1. కర్మ సాక్షి నవకం-సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలం, మరియు పంచభూతాలు (భూమి , నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.)
3. త్రివేణి జలాలు-అంటే 3.
గంగా, యమునా, సరస్వతి.
4. చతుర్విధ జీవులు-4.
అండజాలు, స్వేద జాలు, ఉద్బిజాలు, జరాయుజాలు.
5. షట్ చక్రవర్తులు-హరిశ్చంద్రుడు, నలుడు, పురు కుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు.
6. దశ దానాలు-10.
గోదానం, భూదానం, తిలదానం, సువర్ణ దానం, ఆద్య దానం అంటే నెయ్యి దానం, వస్త్ర దానం, ధాన్య దానం, గుడాదానం అంటే బెల్లం, రౌ ప్య దానం అంటే వెండి, లవణ దానం అంటే ఉప్పు.
7. పంచప్రాణాలు-5.
ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం.
సంఖ్యా పదావళి.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి