సుప్రభాత కవిత ; - బృంద
కాలికింది ఇసుకలా
జారిపోయే క్షణాలు...
అలుపులేని కెరటాల్లా
అలజడిరేపే తలపులు

అగ్నిపర్వతాలు కడుపున
దాచి ఆహ్లాదంగా కెరటాలు
విసరి ఆటలాడే సముద్రం
అచ్చు మన అంతరంగంలా

అంతులేని ఆలోచనలు
ఆరడి పెట్టిన అవమానాలు
అట్టడుగున దాచి
హాయిగా నవ్వే బ్రతుకులు

అలల వేగం తీరందాకే
కలల తీరం కనురెప్ప వరకే
కెరటాలు కడలి లోనే
కలలు కనుల లోనే

ఉప్పొంగే కోరికలను
ఆపేసే  విచక్షణ
అంతర్యుద్ధాన్ని గెలవగలిగే
వివేకం ముఖ్యం

ఆనందపు కెరటాలు 
మనమే సృష్టించుకోవాలి
అనుభవాల మాలలు
మనమే గుచ్చి గుర్తుంచుకోవాలి

ప్రతిక్షణం పోరాడుతున్నా
అందులోనే   ప్రశాంతత
పొందగలగాలి
మనదన్నది మనతో ఉన్నది

రేపన్నది ఎపుడూ ఉన్నది

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు