సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-25
ఏక సూర్య న్యాయము
    ******
ఏక అంటే ఒక అని అర్థం.సూర్య అంటే సూర్యుడు. ఒకే సూర్యుడు పలువురికి పలు రకాలుగా కనిపించడాన్ని ఏక సూర్య న్యాయము అంటారు.
ఒకే దృశ్యం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపించడం సహజం.దీనినే "యద్భావం తత్ రూపం" అని కూడా చెప్పవచ్చు.
 ఓ కిటికీలోంచి బయటకు చూపించి, ఏం కనబడింది చెప్పమని అంటే ఒకరేమో చక్కని ప్రకృతి దృశ్యాలు కనబడ్డాయని,మరొకరేమో మురికి కాలువ,రాలిన ఆకుల చెత్త కనిపించింది అన్నారట.
అయితే ఇవి రెండు నిజమే కానీ చూసే దృష్టిని,ఆస్వాదించే మనసును,ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుందని మనకు అర్థమవుతోంది కదా!
 సమస్యలైనా, సంతోషాలైనా, పరిస్థితులైనా మానసిక స్థితిని బట్టి ఉంటాయని  చెప్పవచ్చు.
"దృష్టిని బట్టి సృష్టి కనిపిస్తుంది" అని అర్థం. ఈ ఉదాహరణలు అన్నీ ఏక సూర్య న్యాయము నకు సరిగా సరిపోతాయి.
అన్ని మతాల సారం ఒక్కటే.కొలిచే విధానమే వేరు వేరుగా ఉంటుంది.మత సామరస్యానికి కూడా ఈ న్యాయాన్ని వర్తింప చేసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు