పడేసిన ఎంగిలి విస్తర్ల పక్క నైనా... పట్టెడన్నం పెట్టారన్న ఆనందమా.... !
స్వర్ణోత్సవాలు...
జరుపుకుంటున్నాం !
అనుకుంటున్నారా.... !?
ఉత్సవాలైనా, ఊరేగింపులైనా
సంబరాలైనా,సందడ్లైనా....,
విందులైనా, వినోదాలైనా....
అన్నీ అమిరినోళ్లకే... అర్ధాక లోల్లకి కాదు... !
ఈ అసమానత లేనాటికీ...
పోయేవి కావా.... ?!
కోట్లకి పడగలెత్తిన కుభేరులు
కూటికి దేబిరించే దీనిలూ ...
అన్నికాలాలలోనూ....
సమాన నిష్పత్తిలోనేనా !?
ఈఅసమానతలుసమసిపోయే
మార్గము వట్టి పగటి కలేనా?
అంతేనా...అంతేనా...అంతేనా
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి