సమాజంలో జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ బడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న కృష్ణమ్మాళ్ జగన్నాథన్ జూన్ 16న జన్మించారు. ఆవిడ గురించి కొన్ని ఆణిముత్యాలు....
తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పట్టివీరన్ పట్టి గ్రామంలో ఓ పేద కుటుంబంలో 1926లో జన్మించారు కృష్ణమ్మాళ్. సొంత ఊళ్ళోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. పదకొండో ఏట తండ్రి కాలం చేశారు. మదురైలో సౌందరమ్మాళ్ నిర్వహణలోని ఉచిత గృహంలో 1936లో చేరి ఉన్నత విద్య చదివారు. అక్కడి అమెరికన్ కాలేజీలో డిగ్రీ ప్యాసయ్యారు. ఈ క్రమంలో మదురైలో డిగ్రీ పొందిన తొలి మహిళగా రికార్డు పుటలకెక్కారు.వినోబా భావే సర్వోదయ సంఘంలో చేరి భూదానోద్యమంలో పాలుపంచుకున్నారు.
గాంధీజీ ఆశయాలకు ఆకర్షితులై భర్తతో కలిసి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.
తన కులానికి చెందిన వారికి జరుగుతున్న దారుణాలను చూసి ఎదిగిన ఆవిడ తన జీవితాన్ని సామాజిక సంక్షేమం కోసం నడుంబిగించారు.
నాగై జిల్లా కీళ్ వెన్మణి గ్రామంలో 1968లో వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన 44 మంది మహిళలు, పిల్లల సజీవ సమాధి దుర్ఘటనకు ప్రతిస్పందించిన కృష్ణమ్మాళ్ భూమి లేని రైతుకూలీల భూమికోసం ఉద్యమించారు.
దిండుక్కల్ సమీపంలో ఉన్న అంబాదురై గ్రామంలో గాంధీ గ్రామ కార్మికుల కోసం భర్తతో కలిసి ఓ ఆశ్రమాన్ని నడిపారు. పల్లెప్రాంతాలలో విరివిగా పర్యటిస్తూ వెనుకబడిన పేద రైతుల సంక్షేమం కోసం సేవలందించారు. పేదల కోసం 2500 ఇళ్ళు కట్టించారు. యువకులు, మహిళలకు స్వయం ఉపాధినిమిత్తం వివిధ రంగాలకు చెందిన వాటిలో శిక్షణ ఇప్పించారు.
నిరాదరణకు గురైన పిల్లలకోసం వసతిగృహాలు ఏర్పాటు చేశారు. పేదింటి మహిళలకు ఆవులు, మేకలు ఇప్పించారు. మద్యనిషేధ ప్రచారంలో చురుకుగా పాల్గొని అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురొనా వేటికీ ఆవిడ వెనక్కు తగ్గలేదు. తన ఆశయసాధనలో ముందుకు దూసుకుపోయారు. పేదల హక్కులకోసం పోరాడుతూ వారి బాగోగుల కోసం అహర్నిశలూ కృషి చేస్తూ వచ్చిన ఆవిడ తాను పాందిన పారితోషికాలనూ వారికే ఖర్చుపెట్టారు. టాట్కో పథకం కింద రుణాలు పొంది ఒకరికి ఒక ఎకరం భూమి అని సాధించిపెట్టారు. ఒకమారైతే ఒకే రోజులో 1040 ఎకరాల భూములను పేద రైతులకు పంపిణీ చేయించారు.
తన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మభూషణ్, జమన్ లాల్ బజాజ్, భగవాన్ మహావీర్, అమెరికా విశ్వవిద్యాలయ అవార్డులు పొందిన కృష్ణమ్మాళ్ తన తొంభయ్యో ఏట కూడా నిరుపేదల శ్రేయస్సుకోసం కృషి చేయడం విశేషం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి