హైదరాబాద్ నిజాం ఆసఫ్ జాహ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాతికేళ్ళ యువకుడు. 18ఏళ్ల టర్కీ ఆఖరి ఖలీఫా కుమార్తె రాకుమారి షెహవార్ తో 1931లో అతనికి నికాహ్ ఐంది. ఇతను 7వనవాబు. ఇతను చేసిన ప్రయోజనకరపనులవలన చాలా ప్రసిద్ధిచెందాడు.దానికి కారణం ప్రేరణ టర్కీ రాకుమారి! ఆమె పూర్తి పేరు దుర్ షెహ్వర్!
బాల్యం నించి ఆమె సమాజహితం సేవచేయాలనే భావాలతోపెరిగింది.1924లో టర్కీ గణతంత్ర రాజ్యం గా ఆవిర్భవించింది. అబ్దుల్ మజీద్ (2)టర్కీ కి ఆఖరి ఖలీఫా.ఆయన కుమార్తె దురూ1914లో పుట్టింది. అందచందాలు గుణగణాలున్న ఆమెని తమ కోడలిగా చేసుకోవాలని పర్షియా రాజు ఈజిప్టు రాజు పోటీపడ్డారు.కానీ
నిజాం ఆమెను చేపట్టడంలో సఫలమైనాడు. 1924లో టర్కీ గణతంత్రరాజ్యంగా అవతరించటంతో ఖలీఫా దేశం విడిచి పెట్టాల్సి వచ్చింది. బ్రిటిష్ రెడ్ క్రిసెంట్ సొసైటీ కి ఆయన పై సానుభూతి తో ప్రపంచంలోని ముస్లిం పాలకులకు విజ్ఞప్తి చేయటం తో స్పందించారు మౌలానాషౌకత్ అలీ మౌలానా అలీ. ఈసోదరులు హైదరాబాద్ నవాబ్ కి నచ్చ జెప్పి ఒప్పించటంతో ఖలీఫా కి300పౌండ్లు లైఫ్ టైమ్ పెన్షన్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాడు.కుటుంబంలోని వారికి కూడా భత్తెం ఇస్తానని నిజాం వాగ్దానం చేశాడు. పనిలో పనిగా షౌకత్ అలీ సలహాపై నిజాం పెళ్లి జరిగింది. అతని కన్నా ఆమె పొడుగు!వెనీస్ నుండి భారత్ కి భార్య తో ఓడలో వస్తుండగా మహాత్మా గాంధీ కూడా అదే ఓడలో ఉన్నారు. ఇక దురూ షెహ్వార్ మంచి శక్తి సామర్ధ్యాలున్న గృహిణి కూడా!హైదరాబాద్ లో విమానాశ్రయం ఉస్మానియా ఆసుపత్రి ఆమె కృషికి దర్పణం!పాత నగరం లో మహిళలు పిల్లల కోసం ఓజనరల్ ఆసుపత్రి కట్టించింది.1939లో అలీగఢ్ లోఅజమల్ ఖాన్ తిబ్బియా కాలేజీ ఆసుపత్రి ప్రారంభించింది.హైదరాబాద్ లో ఆడపిల్లల కోసం జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసింది.
విధి అంటే ఇదేనేమో?! ఖలీఫా కూతురు తెలుగుప్రాంతంలో కాలుపెట్టి నిజాం భార్యగానే నాలుగుగోడలమధ్య ఉండిపోక హైదరాబాద్ కి విద్య వైద్య సౌకర్యాలు ఏర్పర్చటం ముదావహం! ఋణానుబంధం అంటే ఇదేనేమో!?🌺

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి