అదీ 1967. ఎం.ఆర్. రాధా జరిపిన కాల్పుల్లో ఎం.జి. రామచంద్రన్ (ఎంజిఆర్) ఎట్టాగో ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరూ పేరున్న గొప్ప నటులే.
ప్రాణానికి ముప్పు లేకున్నప్పటికీ ఎంజిఆర్ గొంతుకి ప్రమాదం సంభవించింది. గొంతు సమస్యతో మాట ముద్దగా ఉండేది.
అప్పట్లో ఎంజిఆర్ "కావల్ కారన్" అనే సినిమాలో నటిస్తున్నారు.
ఆయన మాట స్పష్టంగా లేదు. అది అందరికీ తెలిసింది. ఏం చేయాలాని సినీబృందం ఆలోచిస్తున్నాది.
ఒకరన్నారు "ఎంజిఆరుకి బదులు మరొకరితో డబ్బింగ్ చెప్పించి సినిమా విడుదల చేయిద్దాం " అని.
కానీ అందుకు ఎంజిఆర్ ఒప్పుకోలేదు.
"నాకెవరూ డబ్బింగ్ చెప్పక్కర్లేదు. ఇప్పుడేర్పడింది సమస్యే కాదు. ఇప్పుడు తనకెదురైన ఈ సవాలుని నేనే స్వీకరిస్తాను. నా సొంత కంఠంతోనే మాట్లాడుతాను. దానిని ప్రజలు స్వీకరిస్తే సినిమాల్లో నటించడం కొనసాగిస్తాను. ఒకవేళ గొంతు బాగులేదనే మాట వస్తే సినిమా నుంచి తప్పుకుంటాను పూర్తిగా" అన్నారు ఎంజిఆర్.
సవాలుని ఎదుర్కొని ఎంజిఆర్ తానే డైలాగులు చెప్పారు. "కావల్ కారన్" సినిమా పూర్తయి విడుదలైంది.
సినిమా చూసిన ఆయన అభిమానులు ఆయన మాటలో వచ్చిన మార్పుకి విస్మయం చెందారు. బాధపడ్డారు. ఒకటికి పలుసార్లు మళ్ళీ మళ్ళీ సినిమాను చూసారు. మారిపోయిన ఆయన గొంతే ఓ పబ్లిసిటీగా మారిపోయింది. ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆడింది సినిమా. సూపర్ డూపర్ హిట్టయ్యింది సినిమా.
ఈ సంఘటనతో ఓ విషయం స్పష్టమైంది.
జీవితంలో ఏదైనా ఓ సమస్య తలెత్తినప్పుడు డీలా పడిపోకుండా మన వంతు ప్రయత్నాన్ని అంకితభావంతో చేస్తే అనుకున్నది సాధించవచ్చని.
సమస్య అనడంతోనే వెంటనే చాలా మంది జరగరానిదేదో జరిగినట్టు మిన్ను విరిగి మీద పడ్డట్టు డీలాపడిపోయి ఆందోళన చెందుతారు. భయపడిపోతారు. అలాకాకుండా నాకొక సవాల్ అనుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ధైర్యమూ ఆత్మవిశ్వాసమూ ఉంటే ఏ క్లిష్టమైన పనైనా చేసేయొచ్చు. విజయం సాధించామన్న తృప్తి కలుగుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి