జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడపాకల్ విద్యార్థుల రాసిన కథలు రాష్టస్థాయి తెలంగాణ బడి పిల్లల కథల పుస్తకంలో మరోసారి మెరిసాయి. రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సిరిసిల్ల వారు గత సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా బడి పిల్లలు రాసిన కథలను స్వీకరించి అందులో మంచి సందేశం తో కూడిన కథలను ఎన్నుకొని వాటితో "కతల చెట్టు" పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఇందులో తడపాకల్ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థుల కథలు ప్రచురితమైనవి. రోషిణి రాసిన నిస్వార్థ సేవ, అభినయ్ రాసిన దురాశ కథ, అభిలాష్ రాసిన పెద్ద వేప చెట్టు, హన్సిక రాసిన పర్యావరణ పరిరక్షణ, గ్రీష్మ రాసిన మిత్రలాభం, సమీనా రాసిన తెలివైన ఏనుగు కథలు
గంగాదేవి ఈ కథల కోసం వేసిన అందమైన బొమ్మలు ఈ కథల పుస్తకంలో చోటు సంపాదించుకున్నాయని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. వీరికి త్వరలోనే ప్రశంస పత్రాలను నగదు బహుమతిని అందజేస్తారని తెలిపారు.కథల పుస్తకములో చోటు సంపాదించుకున్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం రవీందర్, నాగప్ప,కృష్ణప్రసాద్ గంగాధర్ అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి