అతడు ప్రేమించాడట...
ఆమె కాదంది !
యాసిడ్ తో దాడి....
అయ్యో ఇదా ప్రేమ... !?
******
కామం... స్వార్ధమే....
త్యాగమె... ప్రేమ !
స్వార్ధంతో కానే కాదు...
త్యాగం తోనే ఆనందం !!
*******
కామిస్తే... ద్వేషం
ప్రేమిస్తే... త్యాగమె !
చంపి - చచ్చి కాదు...
బ్రతికి - బ్రతికించి... !!
*****
ప్రేమకోసం....
మరణించి కాదు...
ప్రేమకోసమే పరితపించి
. మెప్పించాడు !
*****
ప్రేమించి కాదు.....
ప్రేమను బ్రతికించి...
ప్రేమ జగతిలో.....
గెలిచి... నిలిచాడు !
******
కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి