పిల్లలు మీరు శ్రీరామచంద్రుడు గురించి విన్నారు కదా మనం ఇప్పుడు ఆ రాముని కథ మాట్లాడుదాం
మహారాజుకి పిల్లలు లేకపోవడం వలన ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేశారు.
దశరధమహారాజుగారికీ ముగ్గురు భార్యలు కౌసల్య, కైకేయి ,సుమిత్ర. వారి పేర్లు!
ఆయన యజ్ఞం చేశాక యజ్ఞ ప్రసాదం ముగ్గురికి ఇచ్చి వారిని తీసుకోమన్నారు. కౌసల్యకి సగం, కైకేయి సగం ఇచ్చారు. వారిద్దరూ సగం, సగం సుమిత్రకి ఇచ్చారు.అందువలన కౌసల్య కు రాముడు కైకేయి కి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులుపుట్టారు. వీరు నలుగురిని అల్లారు ముద్దుగా పెంచారు. కైకేయి మాత్రం రాముడునీ ఎంతో ముద్దుతో పెంచింది తన కుమారుడు భరతుడు నిమాత్రం అంతగా పెంచలేదు. అయినా కైకేయిని చెడ్డగా అనుకుంటారు. కైకేయి అంత చెడ్డది కాదు.
దశరథ మహారాజు రాములు వారికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయిస్తారు అప్పుడు
రాజ్యం లోని ప్రజలు అందరూ సంబరాలు జరుపు కుంటున్నారు. కానీ అది రాణివాసంలో అంతపురం లో తెలియదు
సాయంత్రం గా మంధర కైకేయి ప్రియ సఖి
జనుల సంతోషాన్ని చూసింది అక్కడ జరుగుతున్న సంబరాలకి కారణమేమిటిని మిగతా వారిని అడిగి తెలుసుకుని కైక దగ్గరకి వచ్చింది. మంధరని తోటి
పరిచారికలు " పాపిష్టిది"అని పేరు పెట్టారు. అంచేత ఆమెకి మంచి కూడా చెడ్డగానే వినిపిస్తుంది .
కైకేయి దగ్గరకు వచ్చింది, గట్టిగా అరుస్తూ
" ఏమిటీ ! ఏమిటి మొద్దు నిద్ర అంది!'ఏమయింది
మంధరా "? అంది. కైకేయి.
" అక్కడ కొంపలు కూలిపోతుంటే నువ్వేంటి ఈ సన్నాయి నొక్కులు"అంది." సరే కానీ ఏమైందో చెప్పు" .
"రాముడికి పట్టాభిషేకం అంట"! అనేంతలో మంచి
మాట చెప్పావంటూ ముత్యాలహారం తీసి ఇచ్చింది.
కైకేయి. ఎంత సంతోషమో? అంది.
"నా రాముడికీ పట్టాభిషేకం చాలా మంచివార్త కదా ఆనందించాలి కదా! అన్న కైక మాటలకి . నీకు చెడ్డ కాలం వచ్చింది అందుకే ఇలా అంటున్నావ్ జీవితాంతం దాసీ గా పడి వుండే గీత నీది ఎవరు
తప్పించగలరు అంది మందర
" రాముడు పెద్దవాడు పెద్దవాళ్లకే పట్టాభిషేకం చేయాలి అందుకే సంతోషించాను ఇందులో తప్పే మిటీ?అనగానే మంధర చీర కొంగు మెడకిచుట్టీ
నేను చస్తా నువ్వు జీవితాంతం పనిమనిషి గా పడి
వుండు అంది.పిల్లలూ భయపడి కైకేయి ,ఏం
చేయాలో చెప్పు అంది అప్పుడు రాజుగారు కైకేయి కి ఇవ్వాల్సిన వరాల గురించి చెప్పింది.
అంతే మొత్తం మంచి పోయింది చెడు నిలిచింది. కాబట్టి పిల్లలు మీరు నేర్చుకోవాల్సిందేంటి?
చెడ్డ మాటలు వినకూడదు చెడ్డవారితో స్నేహం తగదు మన మనసుకి మంచి అనిపించింది పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు మనం పాటించాలి కదూ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి