ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (3)- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,

 రాజశేఖర్ రెడ్డి గారు గుక్క తిప్పుకొని  అదేమిటి రెడ్డి గారు ఎంతోమంది  ఐఏఎస్ అధికారులతో సంప్రదించి  ఈ నిర్ణయాన్ని తీసుకుని వారిని  ఎన్నిక చేయడం జరిగింది.  ఆ వ్యవస్థనే తప్పుపడుతున్నారు  కారణం తెలుసుకోవచ్చునా?  అని ముఖ్యమంత్రి హోదాలో కాకుండా వ్యక్తిగా ఆయన ఎంతో అణకువగా ప్రశ్నించారు.  దానికి సమాధానంగా మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది  నిజంగా వ్యవసాయ శాఖను అర్థం చేసుకున్న వ్యక్తులనే మీరు నిర్ణయించి ఉద్యోగం ఇచ్చారు కాదనను  కానీ వారు చేస్తున్నది ఏమిటి  ప్రభుత్వ ఖర్చుతో వారి జీపులో వచ్చి  ప్రతి గ్రామం వెళ్లి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లి తిరిగి ఆఫీసుకు వెళ్లిపోవడం తప్ప ఏ గ్రామంలోనైనా ఏ ఒక్క రైతు నైనా కలిసి అక్కడ పరిస్థితులను  గురించి తెలుసుకున్న వారు ఏ ఒక్కరైనా ఉన్నారా?  అలా లేనప్పుడు దానివల్ల ఏమిటి ప్రయోజనం. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు  ప్రతి గ్రామం సుభిక్షంగానే ఉంది అన్నీ చూసుకుంటున్నాం  అన్న నివేదికలను తప్ప  ప్రత్యక్షంగా వారు చేస్తున్నది ఏమిటి  అన్నప్పుడు  దానికి పరిష్కారం కూడా మీరే చెప్పండి అని  రాజశేఖర్ రెడ్డి గారు సభా ముఖంగా అడిగినప్పుడు  మీరు  ఎన్నిక చేసిన ప్రతి ఉద్యోగి ఏ రోజైనా ఏ గ్రామంలోనైనా ఏ రైతునైనా కలిశారా?  ఆ రైతు చెప్పిన  బాధలను కానీ, లోపాలను గురించి కానీ ఏమైనా సమాధానాలు ఇస్తున్నారా?  పరిష్కారాలు చూపని వారి చదువు రైతుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. కనుక మీరు ఆలోచించి  ప్రతి ఉద్యోగికి కొంత ఇన్సెంటివ్స్  ఇచ్చి అతనిని ప్రోత్సహిస్తే  వ్యవస్థ బాగుంటుంది  అని చెప్పినప్పుడు ప్రక్కనే ఉన్న పి.ఏ తో తక్షణం దానిని అమలు చేయమని అక్కడే జీవో తయారు చేసేట్లుగా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర్ రెడ్డి గారు.
ఆ క్షణాన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జిల్లాలో ఎవరినైతే తాను ఉత్తమ రైతుగా ఎన్నిక చేసారో వారికి ప్రతి నెల 5000 రూపాయలు నగదు ఇచ్చి  ప్రతి రైతు వద్దకు వెళ్లి  వ్యవసాయానికి సంబంధించిన మంచి చెడులను వారికి చెప్పి వారిని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీకు అప్ప జెపుతున్నాను ఈ డబ్బులు మీకు జీతంగా నేను ఇవ్వటం లేదు  మీ ప్రయాణ ఖర్చుల కోసం లేదూ. కారు  నీకు ఏదైనా వాహనం ఉన్నప్పుడు దానికయ్యే ఖర్చుగా మీరు భాగించాలి  అని చెప్పి  వెన్ను తట్టి ముందుకు నడిపించి  తాను ఏ ఆశయాన్ని  ఫలప్రదం చేయదలుచుకున్నారో దానికి ఆసరాగా నిలిచిన  వ్యక్తులను ప్రోత్సహించి  రైతుకు అండగా నిలిచిన వారు  ప్రథమంగా రాజశేఖర్ రెడ్డి గారే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సభాముఖంగా ఇంత మంచి ఆలోచన చేసిన  రెడ్డి గారిని అభినందిస్తున్నాను వారిని అనుసరిస్తే ప్రతి పార్టీ తమ ఆలోచనలను  మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది  అని చెప్పారు రెడ్డి గారు.

కామెంట్‌లు