చెచకుముకి పిల్లలం
లకుముఖి మల్లెలం
అగరొత్తుల వారలం
పూలగుత్తుల పోరలం !
అగరొత్తులు చేస్తాం
అంగడిలో అమ్మేస్తాం
గొంగడి కొని తెస్తాం
రంగడికి మేం ఇస్తాం !
చెరుకు తోటకు వెళ్దాం
చెరుకు గడలు కోస్తాం
ఇంటికి కొని తెస్తాం
పంటితో రుచి చూస్తాం !
వ్యవసాయం మా కిష్టం
చేస్తాం మేం నిత్యం కష్టం
తీస్తాంలే ఇక ఫల సాయం
ఏమాత్రం వ్యయం చేయం !
అమ్మ చేతి వంటనే తింటాం
కమ్మని కలలను మేం కంటాం
అమ్మ ప్రత్యక్ష దైవం అంటాం
నిమ్మలంగా మేం జీవిస్తుంటాం !
రాత్రి బడికి పోతుంటాం
చదువే ముఖ్యం అంటాం
గురువు మాటనే వింటాం
పలక బలపం మేం కొంటాం !
చిట్టి పొట్టి కథలను రాస్తాం
పత్రిక సంపాదకులకు ఇస్తాం
వారు పత్రికలో అచ్చు వేస్తరు
ఊరు వారంతా ఇక చూస్తరు !
రకరకాల ఫోటోలు గూడా తీస్తాం
కోరిమరి ఏరి పోటీలకు పంపిస్తాం
బహుమతులు గట్రా ఏవైనా వస్తే
మామదిలోమాకు సంతోషం మస్తే !
మా ఊరివారందరూ వచ్చి
మా అభివృద్ధిని వారు మెచ్చి
ఆశీర్వదిస్తారు వారు మమ్ము
వారి దీవెనలే మాకిక సొమ్ము !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి