వేద కాలము నుంచి మనుషులను మూడు రకాలుగా విభజించారు సాత్వికులు తన కార్యములు తాను చేసుకుంటూ ఏ శాశ్వతమైన పదార్థమున్నదో దానికోసం ప్రయత్నం చేసేవారు ఎవరి విషయాలలోనూ జోక్యము చేసుకోకుండా జీవితాన్ని సుఖప్రదం చేసుకుంటున్నాడు రెండవవాడు రాజస ప్రధానులు తాను చేసే ప్రతి పని ఇతరులకు తెలిసేలా చేస్తాడు తాను ఎవరి జోలికి వెళ్ళడు ఎవరైనా తన జోలికి వచ్చినట్లయితే ఆత్మాభిమానాన్ని చంపుకోడు దానికి తగిన సమాధానం చెబుతాడు చివరిగా తామసులు తమస్సు అంటేనే చీకటి తన జీవితం మొత్తం చీకటి తనకు సంబంధం లేని ప్రతి విషయాలలోనూ కలుగచేసుకుని ఎదుటివారిని కొట్టడం వారి చేత కొట్టించుకోవడం చేస్తూ ఉంటాడు. మనిషి యొక్క మనుగడను సక్రమంగా జరిగేలా చూసేవి శరీరంలో ఉన్న ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క గుణం ఉంటుంది ఈ ఇంద్రియములకు లోబడి కనిపించిన ప్రతి ది తనకు కావాలని ఆశించేవాడు ఎదుటివారి ఆస్తిపాస్తులను కూడా తనవిగా చేసుకోవాలని కోరుకునేవాడు ఎక్కువగా ఇంద్రియ లోపం కోరికలను పెంచుకోవడం వల్ల కలుగుతుంది ప్రత్యేకించి స్త్రీ వ్యామోహం దానికి లోనై జీవితాన్ని కొనసాగించే వాడిని ఆ తమసుడుగా లెక్కిస్తున్నాడు వేమన తరువాత తమస్ ప్రవర్తి కలిగిన వారు తానేదో ఘనకార్యాన్ని చేయాలనుకుని కార్యాన్ని ప్రారంభించి భక్తిగా చేసి ఇంద్రియాలకు ఆ గుణాన్ని ఆపాదిస్తూ జీవితాన్ని గడుపుతున్న వాడు చివరి వారు ఉత్తములు జీవితంలో దేనిని కోరుకోవాలో దానికోసం ప్రయత్నం చేస్తూ మనసును దాని మీదే లగ్నం చేసి అంకితభావంతో ప్రయత్నం చేసిన వాడు జీవితంలో సఫలీకృతం అవుతాడు తాను సాధించవలసిన ముక్తిని తప్పక సాధిస్తాడు వారిని జితేంద్రుడు అంటారు అంటే దానికి అర్థం ఇంద్రియములను జయించినవాడు కామ క్రోధ మోహలతో కూడిన అరిషడ్ వర్గాన్ని జయించి నిశ్చల మనసుతో ఉన్న వ్యక్తిని తప్పకుండా మహీశుడు అవుతాడు ఆయన సర్వదా సుఖంగా జీవిస్తూ పరమ యోగి అని పిలిపించుకోబడతాడు సమాజంలో అలాంటి ఉత్తములకు ఉన్న గౌరవ మర్యాదలు మిగిలిన రెండు తరగతుల వ్యక్తులకు ఉండవు మన పెద్దవాడు చెప్తూ ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు జరుగుతుంది అని ఆ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు వేమన ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"ఇంద్రియ వరవశుడధ ముండింద్రియ పరవశుడు భక్తి యెడమధ్యముడౌ నింద్రీయ జయుడుత్తముడు జితేంద్రియ సమ్మదుడు విన మహేశుడు వేమ..."
"ఇంద్రియ వరవశుడధ ముండింద్రియ పరవశుడు భక్తి యెడమధ్యముడౌ నింద్రీయ జయుడుత్తముడు జితేంద్రియ సమ్మదుడు విన మహేశుడు వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి