సహజమే..... అందమూ...,
ఆనందము.... !
జీవితంలో...బాల్యాన్నిమించిన
సహజత్వ మేమున్నది... !?
ఆ అందం సహజంG.... !
ఆమనసు..నిర్మలం,నిష్కల్మషం
ఆ అందం... సమ్మోహనం !!
పెరిగేవయసుతెచ్చినవికారాలు
శారీరకంగా నైనా...
మానసికంగా నైనా.... !
పొంగులు-క్రుంగులమిశ్రమాలే!
అందమూ... కృతకమే... !
ఆనందమూ... కృతకమే... !!
వయసుపెరిగే కొద్దీ... మనసు కలుషితం... !
అస్థిరమైనయవ్వనసౌందర్యం
తెచ్చే అహంకారం.... !!
ఎన్ని కసరత్తులు చేసినా...
ఎన్నెన్ని సౌందర్య సాధనలతో
ఎన్ని పాట్లు పడినా ...,
నిరాశ, నిస్పృహ, నీరసాలే!
పటుత్వంలేని ఎముకలు...
వడలి పోయిన చర్మం....
బీపీ, షుగర్, గేస్ట్రిక్ లైతే...
చెప్పనక్కరే లేదు... !
మనిషి రూపమూ వికారమే...
మనసూ వికారమే... !
మనిషికి బాల్యాన్ని ఆ దేవుడు
వరంగా ఇచ్చాడు... !
ఆ బాల్యాన్ని జీవితానికి...
శాపంగా మార్చుకోవద్దు...
మార్చొద్దు.... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి