న్యాయాలు -46
ఖలే కపోత న్యాయము
*****
ఖలః అంటే కళ్లము, భూమి,నేల, ప్రదేశము,కుప్ప, అనే అర్థాలతో పాటు దుష్టుడు అనే అర్థం కూడా ఉంది.కపోతం అంటే పావురం.
కళ్ళంలో పావురాలు గుంపుగా వాలి గింజలు తింటూ వుండగా వేటగాడు వచ్చి వల వేస్తాడు. అది గమనించిన పావురాలు భయపడకుండా అన్నీ కలిసి ఒక్క సారిగా వలతో సహా పైకి ఎగిరి పోవడాన్ని ఖలే కపోత న్యాయము అంటారు.
గుంపుగా ఉన్న పావురాలన్నీ వలలో చిక్కుతాయి. తన పంట పండినట్టే అని సంబర పడిన వేటగాడికి ఆశ అడియాసే అవుతుంది. తన వల కూడా లేకుండా పోతుంది.
వాటి ఐకమత్య బలం ముందు తాను వేసిన వల, పన్నిన ఉపాయం ఎందుకూ పనికిరాకుండా పోతాయి.
ఐకమత్యంతో ఆపద నుండి బయట పడవచ్చనీ, అత్యాశ పనికి రాదని చెప్పడానికి ఈ ఖలే కపోత న్యాయమును రెండు విధాలైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మన చిన్నప్పుడు పెద్దలు ఇలాంటి పంచతంత్ర కథలు ఎన్నో చెప్పేవారు.
పావురం పేరు చిత్ర గ్రీవం. పావురాల నాయకుడు. ఓ సారి గుంపుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నపుడు అడవిలో నేలపై ఓ చోట గింజలు కనబడతాయి. అవి చూసిన పావురాల గుంపు "మేత ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఒక్క చోటే దొరుకుతోంది తిందాం పద " అని తొందర పెడుతుంటాయి.
"ఇదేదో మోసంలా ఉంది.అడవిలో అంత ధాన్యం ఓకే చోట రాశిగా ఉండదు.కాబట్టి అక్కడ వాలొద్దు" అంటాడు చిత్రగ్రీవుడు.
అయినా నాయకుడి మాటలు ఖాతరు చేయకుండా ఏం కాదంటూ కింద వాలడం, వెంటనే వేటగాడి వలలో చిక్కుకోవడం జరుగుతుంది.అప్పుడు చిత్ర గ్రీవుడే ధైర్యం చెబుతాడు, వలతో సహా పైకి ఎగరమని సలహా చెప్పి, తన స్నేహితుడైన హిరణ్యకుడనే ఎలుక దగ్గరకు తీసుకొని పోతాడు.ఎలుక వలను కొరకడంతో పావురాలు అపాయం నుంచి బయట పడతాయి.
ఇందులో మరో కోణం చూద్దాం. సరైన నాయకత్వం ఉంటే ఎలాంటి క్లిష్టమైన సమస్యలనైనా ఆ నాయకత్వపు దిశా నిర్దేశంలో సంఘటిత బలంతో సాధించుకోవచ్చు అనేది గమనించవచ్చు.
సంఘటిత ఉద్యమాలతో సాధించుకున్నవన్నీ ఈ ఖలే కపోత న్యాయమునకు చక్కని ఉదాహరణలు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి