నువ్వు నడిచి వచ్చే దారిలో
ఆకునై,రెమ్మనై పలకరిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
గాలినై,ధూళినై స్పృశిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
చెట్టునై,పిట్టనై ఆలాపిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
చెరువునై,చేలనై కనిపిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
గుడినై,బడినై వల్లె వేస్తుంటా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
నింగినై,నేలనై వెంబడిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
పూజనై,ప్రార్థనై ఆశీర్వదిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
పాటనై,మాటనై ఆకట్టుకుంటా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
నవ్వునై,పువ్వునై పరిమళిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
కిరణమై,వెన్నెలనై ప్రకాశిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
వేదమై,నాదమై ఘోషిస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
అంకురమై భూమిని చీల్చుకువస్తా!
నువ్వు నడిచి వచ్చే దారిలో
నీకోసం నేను వేచి ఉంటా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి