ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని కాపాడటం ఈ శరీరంతోనే సాధ్యం అనేద సాస్త్ర వాక్యం. మన దేసంలో పర మతాల ఎదురుదాడి కారణంగా అంతరించిపోతున్న ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆదిశంకరాచార్యుడు కాలి నడకన దేశమంతా పర్యటించి తన జన్మను చరితార్థం చేసుకుని, అతి పిన్నవయసులో అంటే కేవలం 32 సంవత్సరాలకే తనువు చాలించాడు. కాని కొన్ని వందల సంవత్సరాలకు సరిపడేంత ధర్మసంపదను అందరికీ పంచాడు. అట్లే వివేకానందుడు కాషాయవస్త్రాలు ధరించి విదేశీయులకు మన సనాతన హిందూ ధర్మాన్ని చాటి చెప్పి, కేవలం నాలుగు పదుల వయసులోనే కన్నుమూశాడు. నేటికీ వివేకానందుని ధర్మసూక్తులు అందరికీ ఆచరణీయంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా నేటి యువత ధర్మ స్థాపనకు, వివేకానందుడిని స్పూర్తిగా తీసుకోవాలి.
ధనసంపాదన, కామ భోగాలు అన్నిటినీ ధర్మమార్గంలో సాధిస్తేనే మోక్షపథానికి చేరుకుంటారనే ఉద్దేశంతోనే పెద్దలు ధర్మానికి మోక్షానికి మధ్యనే అర్థకామాలను ఇమిడ్చారు. ధర్మానికి అంత ప్రాధాన్యత ఉంది. మన ఉపనిషత్తులు ‘సత్యం వద, ధర్మం చర’ అని పలికాయి. ఇన్ని ధర్మాలను సాధించడానికి మన శరీరమే సాధనం. పశుపక్ష్యాదులన్నీ వాటివాటి ధర్మాలను అవి అనుసరిస్తూనే ఉన్నాయి. మానవులు మాత్రం ఎవరికి తోచినట్లు వారు జీవిస్తూ, అదే ధర్మమని భావిస్తున్నారు. ధర్మానికి విపరీతమైన అర్ధాలను తీస్తున్నారు. తమ జీవన విధానమే సనాతన ధర్మమన్న విచిత్రమైన వ్యాఖ్యానాలను కూడా ఇస్తున్నారు.
శాస్త్ర విహితమయిన కర్మలు "ధర్మం" అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి, సజ్జనులకు హాని కలిగించని ధర్మం అనిపించుకుంటాయి. వ్యవస్థాగతంగా వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.
స్వాధ్వౌయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సం కల్పత్వం శివకేశవ భాస్కర దేవ్యౌదుల పట్ల భక్తి ఇవి మానవులు అనుష్టించవలసిన ధర్మాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి