అందమైనది సహజమైనది ప్రకృతి.
పల్లె అందనంత దూరం పట్టణం,
పల్లె ఆత్మీయత అనురాగాల
ముంపు పట్టణంలో ఎవరికి వారే యమునా తీరే!!
ప్రకృతి గీతిక స్వచ్ఛ సంగీత భరితం
నగరం కలుషిత అపస్వరగీతిక
మనుగడ మనసులు స్వచ్ఛమైన
పాలరీతి పట్టణాల ఆలోచన విపరీత కలుషిత ధోరణి
మనుషులందరూ తేలిక మనసుల
ఆనందోత్సవాల సంపుటి పల్లె.
నగరము బరువు బాధ్యతల
మధ్య నలుగుడు పడు విషపూరిత
సంస్కృతి !!
ప్రకృతి సౌరభాలు నిండు ప్రతి మనసున
పల్లెలోన,నాణ్యత కోల్పోయి కలుషిత పంచభూత
సంగమంలో బ్రతుక లేక బ్రతుకు నీడ్చు మానవాళి!!
పరిచయాలు అమృతాలు కష్టాలకు
కొరివి పెట్టి కడతేర్చు!!
పట్టణాన పైసలు లేనిదే పరమావధి లేదు
పట్టణాల నన్ను ముట్టుకోకు నామాల కాకి తధ్ధావతు!
మెరుగులన్నీ చూడ మేలిమి బంగారు పల్లె జీవనము!
నగరమును చూడ నరకప్రాయము
నగుబాటు పాలు !!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి