చీకట్లో కాంతిలా
ఏకాంతంలో కాంత అలా!!?
చూసి ఆనందించడం
శరీరం లేని
ఆత్మ అనుభవించడం ఒకటే!!!
గుండెకు గోడలు కట్టారు
చూపులకు విద్యుత్ తీగలు నిర్మించారు
రక్తపు దారులు
ఎడారులుగా మార్చారు
ఎదుగుదామంటే
రెక్కలు లేని శరీరాళం మనం
ముట్టుకుందామంటే
గడ్డ కట్టిన మంచు పర్వతాళం మనం!!
ఎక్కడో ఒకచోట
వాలిపోయేందుకు పక్షులం కాదు
లోకమంతా వ్యాపించిన
గాలిలా మనం!!
కష్టపడేందుకు
ఏదో ఒక కార్యం కాదు
ఇది కర్మ కాని కర్మ
సృజనాత్మకత అనుకరించలేవు!!
కష్టపడి తేనెను పట్టగలవు కానీ
తేనెను కూడబెట్టలేవు!!
ఇష్టంతో
పరిమళం పంచగలవు
కానీ దుర్గంధాన్ని మార్చలేవు!!?
ఖర్జూరంతో
రక్తం తయారు చేయవచ్చునేమో కానీ
శుద్ధి చేసే
కాలేయాన్ని నిర్మించలేవు!!!?
రక్తం నింపే దారుల్లో
విద్యుత్తును పంపలేవు
రసాయనాల
రహదారులు మాత్రమే ఏర్పరచగలవు!!
తల పంపే సంకేతాలు
తలలో నింపే సంకేతాలు ఒకటి కావు!!?
పిలిచినా పలకనిచో
అది పేరు కాదు స్పందించే తీరు అది!!!?
అడుగులు పడుతున్నాయి అంటే
ఆలోచిస్తున్నావని అర్థం
తడబడుతున్నాయంటే
నిలకడగా నిలబడున్నట్లు!!?
పీల్చి వదిలేసేయ్
దానీ పని అది చూసుకుంటుంది!!
ఆలోచించి మర్చిపో
ఎక్కడో ఒకచోట
అది నిక్షిప్తమవుతుంది!!!
శరీరం ఊగుతుందంటే
రక్తం కాగుతుందని అర్థం!!
తల తిరుగుతుంది అంటే
భూగోళం తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుని చుట్టూ తిరుగుతుందని
తెలుసుకోవడం!!
ఎత్తిన చేతులు ఏం చెప్తున్నాయి
ఎదుటి తలకు నమస్కరించినట్లు
నీ తలవంచితే ఏం చెప్తుంది
ఎదుటి మనిషి పాదాలకు
నమస్కరిస్తున్నట్లు!!?
అమ్మాయి
ఓ పెద్ద బంగారుగని
విశ్వమంతా ఆకర్షించే
ఓ పెద్ద అయస్కాంతం!!!
నీ వంతు వచ్చినప్పుడు
లేచి నిలబడకు కూర్చో!!
ఆకాశం విరిగిపడిన
తీగలు తెగిపడిన
ముట్టుకుంటే అది అల్యూమినియం
తీగ కాదు
అది బంగారు తీగని మర్చిపోకు!!?
మహాశివరాత్రి శుభాకాంక్షలు
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి