నేను అన్నివిధాల తక్కువ నన్ను అంతా చులకనగా చూస్తున్నారు అనే భావం మనలో ఉంటే మనసులో విచారిస్తూ కుమిలి పోతాం.దీన్ని ఆంగ్లంలో ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ అంటారు. దివ్యాంగులు ఇలా ఉండకుండా అన్నివిధాలా సర్వాంగాలతో లక్షణంగా ఉన్న మనల్ని వెనక్కి నెట్టి దూసుకుపోతున్నారు. క్లాస్ లో తక్కువ మార్కులు వస్తే మనం అందంగా లేము అన్న భావం ఉంటే రాణించలేము.గాంధీజీ కి 13వ ఏట పెళ్ళి ఐంది. కస్తూరిబా ఆయన కన్నా కొన్ని నెలలు పెద్దది.బడిలో ఎవరితోటీ కలిసేవాడుకాదు.గేమ్స్ కి డుమ్మా కొట్టేవాడు.బడిచదువు ముగిశాక మెడికల్ కాలేజ్ లో చేరాడు. కానీ అక్కడ కూడా తనపై తనకు నమ్మకం లేకపోటంతో కొద్దిరోజులకే బైట కి వచ్చారు. బారిస్టర్ చదవాలని ఇంగ్లాండ్ వెళ్లి ఎన్నో సమస్యలతో బాధ పడ్డాడు.ఆయన సింపుల్ డ్రెస్ ఆంగ్లం సరిగ్గా మాట్లాడలేకపోటంతో కష్టపడి చదువుతూ ఫ్రెంచ్ భాష డాన్స్ నేర్చుకుని అక్కడి దుస్తులు ధరించే అలవాటు చేసుకున్నారు. ఆర్ధిక బాధలు పీడించటంతో చిన్న గదిలో వంట చేసుకుని కాలేజీ కి నడిచివెళ్లేవాడు.నల్లజాతివాడని ఆయనకి క్షవరం చేయడానికే నిరాకరిస్తే తనజుట్టు తనే కట్ చేసుకుని "మిష్టర్ గాంధీ!ఎలుకలు కొరికాయా నీక్రాఫ్ ని?" అని తోటివారు వెక్కిరిస్తే అసలు వారి మాటలు వినటం మానేశాడు.అలాంటి గాంధీజీ బోడితల పిలక కొల్లాయి కట్టి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని బ్రిటిష్ వారిని అగ్గగ్గ లాడించాడు.ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ లేకుంటే మనం త్వరగా అందరితో కలిసి అభివృద్ధి పథంలో సాగుతాము.🌺
ఇన్ఫీరియార్టీ!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి