ఓ విదేశ ప్రేమజంట తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేసుకున్న ఉదంతమిది.
ఇంగ్లండుకి చెందిన మైఖెల్ దంపతుల కుమారుడు అలన్ (28), తన దేశానికే చెందిన లియో (28) అనే యువతిని అయిదేళ్ళుగా ప్రేమిస్తున్నాడు.
మూడేళ్ళ క్రితం ఆరోవిల్ (పాండిచ్చేరి) వచ్చిన ఈ ప్రేమికులు అక్కడే నివసించసాగారు. అలన్
వ్యవసాయపనులు చేస్తున్నాడు. అతని ప్రేయసి ఓ వికలాంగుల స్కూల్లో పని చేస్తోంది.
ఈ క్రమంలో వీరికి తమిళభాష మీద మక్కువ పెరిగింది. తమిళం నేర్చుకోవడంతోపాటు తమిళ సంప్రదాయాలను కూడా తెలుసుకుంటూ వచ్చారు. తమిళుల కట్టు బొట్టు నచ్చి వారి సంప్రదాయ ప్రకారం పెళ్ళి చేసుకోవాలను కున్నారు.
ఆరోవిల్ లో ఉన్న ఓ స్కూల్లో తమిళ సంప్రదాయపద్ధతిలో వస్త్రధారణ చేసుకుని సన్నిహితుల సమక్షంలో పెళ్ళి ఇటీవల చేసుకున్నారు. అలన్ - లియోకి మూడు ముళ్ళూ వేయగా స్థానిక పెద్దలు అంక్షితలతో ఈ నవదంపతులను ఆశీర్వదించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి