శేషుకి 15వ ఏట హఠాత్తుగా చూపు పోయింది. ఓవిధంగా అది వంశపారంపర్యంగా వచ్చింది.అతని తాత ముత్తాతల నించి వారసత్వం గా రేచీకటి ఆపై కళ్ళు సరిగ్గా కనిపించకపోటంపై ఓ సంస్థ రిసెర్చి కూడా చేపట్టింది. తల్లి తండ్రుల వైపు రక్తసంబంధీకులు కావటమే దానికి కారణం. పూర్వం ఒకే ఊరు పక్క పక్కనే ఊళ్ళవాళ్లు ఏడుతరాల చరిత్ర తెలుసుకుని మేనరికం అలా చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి .శేషు అమ్మా నాన్న కూడా బావా మరదలు. శేషు అక్క బానేఉంది.మెడిసిన్ ఫైనల్! శేషు కి బ్రెయిలీ లిపిలో శిక్షణ ఇప్పించింది. చక్కగా వైలెన్ వాయిస్తూ రేడియోలో యువవాణి ప్రోగ్రామ్ ఇస్తున్నాడు.ఆరోజు ఓపెద్ద మనిషి వారింటికి వచ్చి "నాయనా! నేను పుట్టు గ్రుడ్డిని.మనోనేత్రం తో చూసే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. ప్రఖ్యాత వైలెన్ విద్వాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడు గారు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు 40వ ఏట చూపుకోల్పోయినారు.ఆయన రాసిన గణపతి నాటకం నేటికీ రేడియోలో వస్తుంది. కడుపుబ్బ నవ్విస్తుంది.ఇప్పుడు పిల్లలు తెగ స్మార్ట్ ఫోన్ తో ఆడుతూ కంటిచూపుపోగొట్టు కుంటున్నారు.ఇప్పుడు మీఅమ్మ ఎన్ని దోసెలు వేశారో చెప్పనా? పది" ."అరె ఎలా తెలిసింది మాష్టారు?" శేషు అక్క ఆశ్చర్యంగా అడిగింది. "వంటింట్లో సుయ్ సుయ్ దోసెలు పోసినపుడు వచ్చే శబ్దం లెక్క పెడ్తున్నాను మీతో మాట్లాడుతూనే!" అంతే శేషులో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగింది.మనసుకే కళ్ళుండాలి.అన్నీ ఉండి తప్పుడు పనులు చేస్తూ సంఘం కి దేశంకి ద్రోహం తలపెట్టేవారే కనులున్న కబోదులు.శారీరకంగా దివ్యాంగులు భవ్యమైన దివ్యమైన మనసు గలవారు. " అన్నాడు శేషు నాన్న పెద్దాయనకి పాదాభివందనం చేస్తూ🌺
మనసుకే కళ్ళు!- అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి