పల్లవి :-
ఓం నమః శివాయ !
ఓం నమః శివాయ... !!
. ఓం నమః శివాయ.... !!!
ఆపంచాక్షరీమహామంత్రమునమహిమాన్వితుడవునీవయ్యా!
ఆ నిరా కార, నిర్గుణ రూపునె
. పూజల నందేవయ్యా... !
నువ్ పూజలనందే వయ్యా !!
ఓం నమఃశివాయ...
ఓం నమః శివాయ....
.... ఓం నమఃశివాయ.... !
చరణం :-
ఓ సాకారా... నిరాకార....
శ్రీకర- శుభకర సదాశివా... !
నీవుహిమగిరిలోఉన్నావందురు
స్మశానమే నీ నివాసమందురు.... 2
అక్కడ - ఇక్కడ ఎక్కడ లేవు
అంతటా... వున్నావయ్యా !
నీ వంతటా ఉన్నావయ్యా !!
ఓం నమః శివాయ....
ఓం నమః శివాయ.....
ఓం నమః శివాయా.......
" ఆ పంచాక్షరీ మహా.... "
చరణం :-
ఈ వికార సృష్టిని లయ మొన రించు నిరాకారుడవు నీవయ్యా.... 2
ని ర్వికారుడవు నీవయ్యా... !
భక్తి, శ్రద్దల... ఏకాగ్ర చిత్తులు
ఎవరైనా నీకొక్కటే....
నీకెవరైనా ఒకటే... !
సురలైనా - నరులైనా.... రా క్షసులైనా నీ కొకటే..,నీకొకటే
ని ష్పక్ష పాతివి నీవయ్యా....
నిర్మలుడవు నీవయ్యా.... !
ఓం నమః శివాయ...
ఓం నమః శివాయ....
ఓం నమః శివాయ.....
*******
శివరాత్రి భక్తి గీతం ; - .... కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి