అక్షరాల పల్లకిని... ఆనందంగా
మోయాలి బాలలూ... !
నేడు బోయీలై మొస్తే... మీరు
రేపు ఆ పల్లకీయే...
మిము మోస్తుంది !!
"అక్షరాల పల్లకిని"
చదువు యొక్క గొప్పతనం
తెలుసుకోండి పిల్లలూ...!
శ్రద్దావాన్ లభతేజ్ఞానం....
అన్నారు పెద్దలు... !!
శ్రద్ధగ జ్ఞానము నార్జించి.....
వివేకవంతులు కావాలి !
మీప్రతిభయే దేశానికి...
గర్వకారణమవ్వాలి.. !!
చదువు వలన సంస్కారం
చక్కగ మీకు అబ్బాలి... !
మీ సంస్కారంతో సమాజాన్ని
మీరే తీర్చి దిద్దాలి.... !!
"అక్షరాల పల్లకిని... "
సుఖపడుతూ - సుఖపెడుతూ
అందరమానందంగా...
బ్రతకాలి.... !
చదువుకు అర్ధము ....
పరమార్దమూ ఇదే...,
తెలుసుకోండి పిల్లలూ.... !
ఈ మానవ జన్మను
సార్ధకం చేసుకోండిపిల్లలు
"అక్షరాల పల్లకిని... "
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి