భూమాత;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు.
నిన్ను మోసే భూమాత
మారుపేరు సహనానికి
ఆకాశం సాక్షిగా
నిదర్శనం త్యాగానికి
 
భూమాతే లేకుంటే
మనిషి మనుగడ కష్టం
కన్నెర్ర చేసినచో
కోలుకోలేని నష్టం

భూమాత గుండె మీద
ఎన్ని సార్లు తన్నినా  
అమాయకపు పిల్లలని
అమ్మ మనసు చూపుతుంది

అన్నింటికాధారం
సృష్టిలోన భూమాత
గుండె కోతకు గురి చేయకు
గౌరవించుము అంచేత

భూగోళం వేడెక్కుతోంది
వృక్షాలను పెంచాలోయ్!
పచ్చదనం ఉంటేనే
పుడమికిక ఉపశమనమోయ్!


కామెంట్‌లు