ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
ఆడపిల్లల్ని
సంసారానికి
సంస్కారానికే కాక
ఆర్థిక వనరులకు
ఆర్థిక సంస్కరణలకు
నిపుణులుగా పెంచండి!
అప్పుడే
ఈ ప్రపంచంలోకి పంపించండి!!!

వాళ్ల ప్రపంచాన్ని
వాళ్లు నిర్మించుకోనియండి!!?

ఈడు వచ్చిందని
ఆడపిల్లల్ని తోడు కోసం
ఎవడికో తగలబెట్టకండి!!?

పచ్చని ఆకు
పత్ర హరితంతో
తన ఆహారం
తనే తయారు చేసుకున్నట్లు!!

ఆడపిల్ల
పచ్చని సంసారాన్ని
తనే నిర్మించుకొని ఉండాలి!!?

దరిద్రాన్ని
వదులుకోవడం అంటే
ఆడపిల్లను వదిలించుకోవడం కాదు
ఆడపిల్లను స్వతంత్రంగా
బ్రతికేట్లు పెంచడం!!?

తల్లి తండ్రి గురువు ఎవరు అంటే
ఆడపిల్లకు చదువు నేర్పించిన వాడు!!

తల్లి తండ్రి గురువు ఎవరంటే
ఆడపిల్లకు బతకడం నేర్పించిన వాడు!!!

తల్లి తండ్రి అంటే
ఆడపిల్లకు పెళ్లి చేసిన వాడు కాదు
తల్లి తండ్రి ఎవరు అంటే
ఆడపిల్లను
గురువు దైవం చేసిన వాడు!!!!

పిల్లల్ని కనండి
పిల్లల కలల్ని కూడా కనండి!!
లేదంటే పిల్లల్ని కనకండి!!?

ఆడపిల్లలకు తోడుగా
అర్హతలు ఉండాలి
మగాడు కాదు!!!?

ఆడపిల్ల అంటే అర్థం
అర్థం కావాలి!!?

బాలికలకు అంకితం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
సూపర్ సార్ ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే మన దేశం త్వరలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక ధనిక దేశంగా విస్తరిస్తుంది