కొడుకులుకూతుర్లులేని
కుటీరాలెందుకు?
తల్లిదండ్రులచూడని
తనయులెందుకు?
చంద్రుడులేనట్టి
చీకటిరాత్రులెందుకు?
తామరపూలులేనట్టి
తటాకాలెందుకు?
నవ్వులులేనట్టి
మోములెందుకు?
పువ్వులులేనట్టి
కొప్పులెందుకు?
మంచితనములేని
మనుజులెందుకు?
ముచ్చటాపరచని
మాటలెందుకు?
ప్రేమలులేనట్టి
బంధాలెందుకు?
రుచీపచీలేని
భోజనాలెందుకు?
పైసలులేనట్టి
జేబులెందుకు?
నీరులేనట్టి
నదులెందుకు?
భక్తిలేనియట్టి
పూజలెందుకు?
రక్తికట్టించలేని
రాతలెందుకు?
సుఖశాంతులులేని
సంసారాలెందుకు?
సొగసుసువాసనలులేని
సుమాలెందుకు?
పనీపాటాలేని
పోకిరీలెందుకు??
కూర్చొనితినేటి
సోంబేరులెందుకు?
అందాలనాస్వాదించని
కనులెందుకు?
అనందంపొందలేని
అంతరంగాలెందుకు?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి