ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (31) ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 మా మనవరాలి పేరు శైలూషి మంచి నృత్య కారిణి అని అర్థం. ఇది పార్వతి దేవి పేర్లలో ఒకటి  బాగా చదివింది మంచి మార్కులతో పాస్ అయింది  దానికి తగినట్లు ఆమెకు సంస్కారవంతుడైన స్నేహితురాలు దొరికాడు  అందరూ కూడా  నా శ్రీమతికి బాగా దగ్గరైన వాళ్ళు నచ్చిన వాళ్ళు  మా అమ్మ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది  ఈ పిల్లలను చూసి ఎంతో మురిసిపోతూ ఉండేది  అందుకని జ్ఞాపకం ఉండడం కోసం  ఆ పిల్లలతో పాటు అమ్మను కూడా కలిపి ఫోటో తీశాను  అబ్బాయి పేరు  వరుణ్  అది 
మా నాన్నగారు పెట్టిన పేరు.
వరుణతో కాలక్షేపం చాలా గొప్పగా ఉండేది  వాడి బాల్య చేష్టలన్నిటిని  అనుక్షణం అనుభవిస్తూనే ఉండేవాళ్ళం  నేను అరుణ తప్ప వాడికి వేరే ప్రపంచం లేదు  అయితే ఆడపిల్ల  బాల్య చేష్టలు చూడలేదన్న  అసంతృప్తి మా ఇద్దరి మనసుల్లో ఉండిపోయింది  నిజానికి అంతకుమించిన ఆనందాన్ని  అందించాడు మా మనవాడు  శైలుషి అన్నప్రాసన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆమెను విజయవాడ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది  ఇన్ని సంవత్సరాలుగా నేను మా చెల్లిని గురించి ఎంత మధన పడుతూ ఉన్నానో  ఆ బాధ వారు పడకూడదు  అనుకొని  మేమే తరచూ నెల్లూరు వెళ్లి పాపతో కాలక్షేపం చేసి వచ్చేవాళ్ళం  అలా మాకు కొంచెం ఉపశమనం కలిగింది అని చెప్పాలి. నెల్లూరు పరిసర ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలను గురించి  వచ్చిన రైతులు వారి ప్రశ్నలకు వీరు సమాధానాలు  చెప్పడం ప్రారంభిస్తే  వ్యాసుల వారి మహాభారతంలా తయారవుతుంది  అందువల్ల వాటిగురించి చెప్పడం లేదు  ఎక్కువగా కార్యక్రమంలో జరిగే ప్రశ్నోత్తర కార్యక్రమాలలో  ఏ మందు  ఎలా వాడాలి  ఏ పంటకు ఏ విధానాలను అవలంబించాలి. చీడ పీడలు వచ్చినప్పుడు దాని నివారణా చర్యలు ఎలా ఉంటాయి  అలాంటి అనేక  సమస్యలను గురించి అడుగుతూ ఉంటే  రకరకాల రైతుల  ప్రశ్నలు బయట వారివి వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది  ఒకే విషయాన్ని నలుగురు రైతులు నాలుగు రకాలుగా అడుగుతూ ఉంటారు  వాటన్నిటికీ ఎంతో  చాతుర్యంతో  రకరకాలుగా  సమాధానాలు చెప్పగలిగిన సమర్థుడు కోటిరెడ్డి గారు.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం