గుంటూరు పట్టణంలో అధిక ధనవంతులలో ఒకరు సుందరయ్య. ఆయన మనవరాలు కన్యక పుట్టినరోజు ఘనంగా నిర్వహింపదలచాడు.నగరంలో పేరుపొందిన వంటవాళ్ళను పిలిపించి " వంటమాస్టారు అతిధిలు వచ్చేదారిలో బత్తాయి, ద్రాక్షా రసాలు ముందుగా అందించాలి.నాకు బంతిలో వడ్డించవలసిన శాఖాహార పదార్ధాలు చెపుతాను రాసుకొండి, మొదటిగా లీటర్ మినరల్ వాటర్ బాటిల్ అందరికి ఇవ్వాలి. పులిహోర, కాయగూరలతోమసాలా అన్నం,దోసకాయ, గోంగూర పచ్చళ్ళు,దానిమ్మ గింజల ఊరగాయ. వడ,మిరపకాయబజ్జి, అరిసె,కజ్జికాయ,పెసర అప్పడం, మినప వడియాలు,ముద్దపప్పు ,మంచిస్వఛ్ఛమైన నేయి, బాసమంతిరైస్ ,సాంబారు,రసం,దప్పళం,పంజాబిపాయసం,గడ్డపెరుగు. ముక్కలు కోసిన బంగినపల్లిమామిడి పండు వడ్డించాలి.భోజనం అనంతరం మూడురకాల ఐస్ క్రీమ్ లు,తరువాత పీటి,తీపి కిళ్ళిఇవ్వాలి.వేయిమందికి సరిపడా చేయాలి,అలాగే మటన్ బిరియాని,చికెన్ కర్రి,ఫిష్ ప్రై,గులాబ్ జాం,రసగుల్లా తోపాటుగా వైట్ రైస్ పెరుగువడ్డించాలి.ఇది ఏడువందలమందికి సరిపడా చేసి 11వ తేదికి,ఫలానా కల్యాణమండపానికి రాత్రి ఏడడు గంటలకు అందించాలి ఎంతఅవుతుంది "అన్నాడు సుందరయ్య.
లేక్కలు చూసున వంటమాస్టారు ఎంతఅవుతుందో చెప్పాడు.
అతను అడిగినంత ఎమౌంట్ కు చెక్కురాసి ఇస్తూ, "వంటకాలు మాహోదాకు తగినట్లుగా ఉండాలి "అన్నాడు సుందరయ్య.
"అయ్య అలాగేఉంటాయి.తమవంటివారి ఇంట విందుఅంటే ఎలాఉండాలో నాకుతెలుసు,అప్పుడేగా మాకుకూడా మంచిపేరుతోపాటు మరిన్ని ఆర్డ్ లువచ్చెది" అని నమస్కరించి వంటమాస్టరు వెళ్ళిపోయాడు.
బహుమతులు స్వీకరించబడవు.ఆశీస్సులు మాత్రమే స్వీకరించ బడతాయి అని ముద్రించిన ఆహ్వనపత్రికను తనబంధు మిత్రులకు అందజేసాడు సుందరయ్య.
మరుసటివారం సుందరయ్యగారి మనవరాలి పుట్టినరోజు ఘనంగా జరిగింది. తను ఊహించినంతమంది అతిధులు రాకపోవడంతో నగరంలోని అనాధఆశ్రమాలకు మిగిలిపోయిన ఆహరపదార్ధాలు పంపించాడు సుందరయ్య.
పదిరోజుల అనంతరం విదేశాలనుండి వచ్చిన బాల్యమిత్రుడు శంకరయ్య ,సుందరయ్యనుకలసి "మన్నించరా నీమనవరాలి పుట్టినరోజుకు రాలేకపోయాను "అన్నాడు.
"మనలోమనకు మన్నింపులేమిటోయ్"అని తనమనవరాలి పుట్టినరోజు విషేషాలను వివరిస్తూ "ఆరాత్రి మిగిలిపోయిన ఆహారపదార్ధాలు మన నగరంలోని రెండు అనాధఆశ్రమాలకు పంపించాను "అన్నాడు సుందరయ్య.
"సుందరం దానంచేయాలి అనుకోవడం గొప్ప అభినందనీయవిషయం.
దానంచేసే మనలాంటి వారందరు బ్రతికిఉండగా వారు అనాధలు ఎలా అవుతారు? అసలు అనాధలు అనేపదమేతప్పు. వారిని నిరాదరులు అనాలి. వారికి అందరూ ఉన్నారు కాని ఆదరించేవారేలేరు అందుకేవారు నిరాదరులు. అలాంటివారికి ఇలాంటి భోజనం పెట్టడం ఎంతప్రమాదమో తెలుసా? వయసుపైబడి పలురకల వ్యాధులతో బాధపడేవారికి ఈభోజనం అరుగుదల ఇబ్బంది పెడుతుంది.మధుమేహం,అధికరక్తపోటు, వంటివి ఆవయసువారికిసహజంగా ఉంటాయి. నీవు పంపిన భోజనం తిన్నవాళ్ళు ఎంత ఇబ్బందికిలోనౌతారో గమనించావా?. మనభోజనంతిని వారు అనారోగ్యానికి లోనైతే ,ఆఆశ్రమనిర్వాహకులు ఎంతఇబ్బందికిలోనౌతారో ఊహించావా? అనారోగ్యంతో బాధపడే ఇంతమందికి వైద్యం చేయించడం ఎంతోకర్చుతో కూడుకున్నపని. దీన్నేఅంటారు పావలాకోడికి ముప్పావలా మసాల అని.అలాంటి భోజనం తినడంకంటే అశ్రమవాసులు అభోజనంగా ఉండటమే మేలు. వైద్యుల సలహమేరకు వారికి బిస్కెట్లు, పాలు,పండ్లు అందించవచ్చు.
ఎవరైనా అనాదరుల ఆశ్రమాలకు ఆహరం పెట్టదలచుకుంటే, తేలికగా జీర్ణమైఏవి వడ్డించాలి.దినపత్రికలు, టి.వి.వంటిసౌకర్యాలు కలిగించవచ్చు. లేకుంటే వైద్యులు వారికి సూచించిన మందులు,వస్త్రాలు, షాంపులు, సబ్బులు, కొబ్బరినూనే,ఇత్యాది నిత్యావసరలాలు.అందించవచ్చు, మగవారికి క్రఫ్ ,గడ్డాలు చేయించడం,అక్కడ ఉన్న వారందరిబట్టలు ఉతికించే వాషింగ్ మిషన్ వంటివి ఏర్పాట్లు చేయించవచ్చు. దానంచేయాలి అనేమనసుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి" అన్నాడు శంకరయ్య.
"నిజమే మనకు మిగిలిపోతున్నాయి అనుకున్నాకాని ఆఆహరం వారికి ఇబ్బంది కలగజేస్తుందని ఊహించలేకపోయాను" అన్నాడు సుందరయ్య.
"రేపు మనం ఆరెండు నిరాదరుల ఆశ్రమాలకువెళ్ళి వారికి వైద్యపరమైన అవసరాలు గమనిద్దాం !"అన్నాడు శంకరయ్య.
సంతోషంగా తలఊపాడు సుందరయ్య.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి