సోమరితనం తగదు.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899.
 అమరవతినగరంలోఅటవీశాఖఅధికారిగాపదవివిరమణచేసిన రాఘవయ్యతాతయ్య ఇంటిఅరుగుపై ఆదివారం కావడంతో ఆవీధీలోని పిల్లలుఅందరు చేరి కథచెప్పమని అడిగారు.పిల్లలుఅందరికి మిఠాయిలు పంచినతాతయ్య"బాలలుపుట్టుకతోసహజంగామనకువచ్చేజాలి, వంటివాటితొపాటుదానగుణం,సేవాభావం,దయాగుణం,వంటిగొప్ప సుగుణాలుమీరుఅలవరుచుకోవాలి.ఇప్పుడు మనం మనిషికి దయాగుణం ఎంతఅవసరమో, దానివలన ప్రయోజనం చెపుతాను.మనం దయకలిగి ఉండడం వల్ల వచ్చిన జ్ఞాపకాన్ని కాలం కూడా చెరపలేదు. దయ యొక్క అందం అది.
 మార్క్ ట్వెయిన్ దయ గురించి ఒక  అందమైన మాట చెప్పాడు. “చెవిటి వారు వినగలిగిన మరియు గుడ్డివారు చూడగలిగిన భాష దయ” .
దయ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
1. దయ కలిగి ఉండడం సెరిటోనిన్ మరియు ఎండోర్ఫిన్స్ అనే మంచి హార్మోన్ మన శరీరంలో విడుదల అవుతాయి. ఇవి మనకి ఆనందాన్ని ఇస్తాయి. మరియు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
2. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీరు దయ కలిగి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమీ లేదో దాని మీదికి మీ దృష్టి వెళుతుంది. దీనివలన మీకు ఉన్నదానితో సంతృప్తి పడడం అలవాటు అయి ఒత్తిడి తగ్గుతుంది.
3. దయ కలిగి ఉండడం మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దయ కలిగి ఉన్నప్పుడు ఆక్సీటోసిన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది. ఇది మన రక్తనాళాలలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనాన్ని బయటికి పంపుతుంది. ఆక్సిటోసిన్ ని గుండెను కాపాడే హార్మోన్ అంటారు. ఈ ఆక్సిటోసిన్ ని మన శరీరంలో విడుదల అయ్యేలా చేసేది దయ.
4. దయ వలన ఆందోళన, బాధ తగ్గుతుంది.
5. దయ చూపించడం వల్ల ఒక వ్యక్తి డిప్రెషన్ నుండి బయటపడతారు.
6. మనలో చాలామంది ఈ జీవితానికి అర్థం ఏంటి అని వెతుకుతూ ఉంటారు. దానికి సమాధానం ఉంది.  మీరు దయ చూపించడం అలవాటు చేసుకుంటే జీవితానికి ఉన్న అర్థం తెలుస్తుంది.
7. ఇది రిలేషన్ షిప్ ని మెరుగుపరిచి జీవితంలో అందమైన క్షణాలని సృష్టిస్తుంది.
8. దయ కలిగి ఉండడం మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మీ గురించి మీరు గొప్పగా అనుకునేలా చేస్తుంది.
9. దయ మీ మూడ్ ని ఆనందకరంగా మారుస్తుంది.
10. దయ వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.మానసిక ఆనందంకలుగుతుంది.ఇవన్ని దయకలిగిఉండటుంవలన జరుగుతాయి.
సోమరితనంఎంత ప్రమాదమో తెలిసేలా ఒ కధచెపుతాను వినండి...
ఈ సృష్టిలో జన్మించినప్రతిప్రాణి కష్టించి తన ఆహారం సంపాదించుకొవాలి అదిప్రకృతి ధర్మం యిదిప్రతిప్రాణి అనుసరించి తీరవలసిందే.తాడికొండ అనే గ్రామంలోని ఓయింటి వేపచెట్టు కొమ్మల మధ్య కాకిజంట గూడుకట్టుకు జీవిస్తున్నాయి . వచ్చిన గాలివానకు ఆచెట్టుకొమ్మఒకటి విరిగి చెట్టునుండి విడిపోకుండా ఆయింటి ప్రహరి గోడపైఒరిగి ఆగిపోయింది.ఆప్రహరిగోడమీదుగా చెట్టుకొమ్మపైకి పిల్లి తములేనిసమయంలో తమ పిల్లకు ప్రాణహని తలపెట్టేఅవకాశం ఉన్నప్పటికి కాకిజంటకు ఓచిన్నకాకిపిల్లఉండటంతో అదిఎగురలేదు కనుక తమగూటిని మరో చెట్టుపైకిమార్చలేకపోయాయి. ఆయింటి ఇల్లాలు ప్రతిరోజు వంటముగించిన వెంటనే కొద్దిగా ఆహరాన్ని ఆకులో ప్రహరిగోడపైన ఉంచేది .ఆ ఆహరాన్నితమపిల్లకుపెట్టి కాకులురెండు ఆహర అన్వేషణలో బయలుదేరివెళ్ళేవి,అలాతినడం సోమరిగామారి నిద్రపోసాగింది కాకిపిల్ల.తనసహజత్వాన్నిమరచి ఎగరడంకూడా నేర్వకుండా.
కొద్దిరోజులు గడిచాక సంభవించిన తుఫానులోప్రయాణిస్తూ దారిలో చిక్కుకుని పెద్దకాకులురెండు మరణించాయి.తమపెద్దలుతెచ్చిపెడితే తినడానికి అలవాటు పడిన కాకిపిల్ల మరుదినం పెద్దలురాకపోవడంతో ఆకలిబాధకు నెమ్మదిగా గూటిలోనుండికొమ్మ మీదుగా ప్రహరగోడపైకి నడుచుకుంటూ వచ్చిఅక్కడఉన్న ఆహరం తిని ఎప్పటిలాగూటిలోనికి వెళ్ళి నిద్రపోసాగింది సోమరికాకిపిల్ల. 
ఒకరోజు ఆహరంకొరకు పిట్టగోడపై నడచివెళుతున్న కాకిపిల్లను చూసిన పిల్లివేగంగాపరుగుతీస్తూ కాకిదగ్గరకు రాసాగిందిపిల్లి.పిల్లిని చూసినకాకి పిల్లఎగరడం నేర్వని కారణంగా వేగంగానడవసాగింది.ఒక్కఉదుటున కాకిపిల్ల గొంతుపట్టుకు కొరికి చంపిందిపిల్లి. 
ఎగరడం సహజంగా తనకుఅబ్బేవిద్యఅయినప్పటికి సోమరితనానికి అలవడ్డ కాకిపిల్లఅలా ప్రాణాలుకోల్పోయింది.బాలలు విన్నారుగా కథ సోమరితనం ఎంతప్రమాదకరమోకనుక.మీరు ఎన్నడూ సోమరితనానికి లోనుకావద్దు మీలోఉన్న సహజమైన ఎదుగుదలను  విడనాడవద్దు" అన్నాడు తాతయ్య. బుద్దిగా తలలుఊపారుపిల్లలుఅందరు.

కామెంట్‌లు