కరోనా నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. ఆర్థిక రంగానికి వెన్నెముకగా భావించే బ్యాంకింగ్ మొదలు సేవల రంగం వరకూ అన్నింటా ఆన్‌లైన్ కార్యకలాపాలే ప్రస్తుతం నడుస్తున్నాయి !!, 2030 నాటికి సేవా రంగంలో 80 శాతం వరకూ కార్యకలాపాలు ఆన్ లైన్ విధానంలోనే నడుస్తాయని అంతర్జాతీయ సైబర్ అధ్యయన సంస్థ అంచనా వేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు 2025 నాటికి 100 శాతం ఆన్ లైన్ విధానం అందిపుచ్చుకోవాలని లక్ష్యం ఏర్పరచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సదరు లావాదేవీలను పారదర్శకంగా.. ఎలాంటి లోపాలు లేకుండా, హ్యాకింగ్‌కు గురికాకుండా నిర్వహించాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇది ప్రత్యేకమైన బ్లాక్‌చైన్ సాంకేతికతతోనే సాధ్యం అవుతోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినోటే వినిపిస్తున్న పదం బ్లాక్చైన్ టెక్నాలజి.! అందుకే ఇప్పుడు బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఐ టి సంస్థలు బ్లాక్ చైన్ టెక్నాలజీలో నైపుణ్యాలున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి..
లావాదేవీలు వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తూ,ఎలాంటి అవకతవకలు జరగకుండా హ్యాకింగ్‌కు గురికా కుండా సంస్థకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచేదే.. బ్లాక్ చైన్ టెక్నాలజీ. ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక పరమైన లావా దేవీలు, భూముల రిజిస్ట్రేషన్, క్రిప్టో కరెన్సీ వంటివి ఆన్‌లై న్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ రక్షణ కల్పిస్తుంది. తొలుత క్రిప్టో కరెన్సీ లావాదేవీలకోసం ప్రారంభమైన ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది.
నిర్దిష్టంగా ఒక లావాదేవీని వికేంద్రీకృత వ్యవస్థలో పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాకింగ్‌కు గురి కాకుండా అత్యున్నత స్థాయిలో భద్రత కల్పించే టెక్నాలజీ ఇది.
ఉదాహరణకు బ్యాంకింగ్ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నగదు నిర్వహణ లేదా రుణ మంజూరు వంటి విషయాల్లో అనేక దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో అధికారి కీలక పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట అవక తవకలకు ఆస్కారం ఉంటుంది. కానీ అదే లావాదేవీని బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో నిర్వహిస్తే..ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు.
బ్లాక్ చైన్ టెక్నాలజీలో.. ప్రతి లావాదేవీలో భాగస్వా ములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతా యి. ఒక బ్లాక్‌లో ఉన్న వారితో కొత్త లావాదేవీ జరిగితే.. అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ చైన్ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్‌లో ఏ బ్లాక్‌లోనైనా.. ఏ చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌లో నమోదవుతుంది. ఇది సదరు నెట్‌వర్క్‌లో నిక్షిప్తం అవుతుంది. దీంతో..ఏదైనా తేడా వస్తే.. సదరు చైన్‌లోని వారందరికీ తెలిసిపోతుంది. పైగా ఎక్సెప్షన్ రిపోర్టింగ్ విధానం వలన ఎవరు, ఏ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డరన్న విషయం క్షణాలలో మానిటరింగ్ అధికారికి తెలిసిపోతుంది. కాబట్టి నిందితులను ఠక్కున పట్టుకోవచ్చు.
అంటే.. ఏ స్థాయిలోనూ ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతంగా, అనధికారికంగా, ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మోసాలు అరికట్టేందుకు సాధ్యమవుతుంది. ఒకవేళ సదరు లావాదేవీలో ఏదై నా మార్పు చేయాల్సి వస్తే.. సదరు డిస్ట్రిబ్యూటెడ్æనెట్ వర్క్‌లోని అధీకృత అధికారులు లేదా వ్యక్తులందరూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా హ్యాష్ ‘కీ’ పేరిట పాస్‌వర్డ్ కేటాయిస్తారు.
బ్లాక్ చైన్ టెక్నాలజీ పనితీరు అత్యంత సమర్థంగా ఉండ టంతో.. ఇతర రంగాలు దీన్ని అందిపుచ్చుకుంటు న్నాయి. ముఖ్యంగా నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్ రంగం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది.
ఆ తర్వాతి స్థానాల్లో రిటైల్, ఈ-కామర్స్, మొబైల్ వ్యాలెట్స్, హెల్త్‌కేర్ విభాగాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో సైతం ఇటీవల కాలంలో బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయం తో.. ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు, ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని ఎన్నికల కమీషన్ నిర్దేశించుకుంది.హెల్త్‌కేర్ రంగంలో.. రోగులకు నిర్వహించే పరీక్షల వివరాలను బ్లాక్‌చైన్ టెక్నాలజీ విధానంలో నమోదు చేస్తున్నారు. ఫలితంగా పారదర్శకంగా సదరు పరీక్షల నిర్వహణతోపాటు సమయం వృథా కాకుండా.. బ్లాక్ చైన్ టెక్నాలజీ దోహదపడుతోంది.
గ్లాస్ డోర్ సంస్థ అంచనాల ప్రకారం-అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ చైన్ రంగంలో ఉద్యోగాలు గత ఏడాది మూడు వందల శాతం పెరిగాయి. మొత్తం ఉద్యోగాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అదే విధంగా లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం-2020లో టాప్ మోస్ట్ జాబ్ సెర్చెస్‌లో బ్లాక్ చైన్ ముందంజలో నిలవగా.. బ్లాక్ చైన్ డెవలపర్ ఉద్యోగాలు 330 శాతం పెరిగాయి.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ -యువత బంగారు భవిష్యత్‌కు భరోసా;- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి