సోదరీ మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మన గురించి మనం తెలుసుకోవాలి. నలుగురికీ చెప్పాలి..ఆత్మ విశ్వాసంతో బతకాలి.. నలుగురినీ బతికించగల మనం ఇంకొకరి దాష్టీకానికి బలి అవ్వటం శోచనీయం:
"మహిళా మూర్తి-స్త్రీ శక్తి"
నిన్ను అంచనా వెయ్యటం ఎవరి తరం!
అమ్మా... మౌనవ్రతం పూని తపోదీక్ష చేపట్టిన దక్షిణా మూర్తిని నీ శక్తితో ప్రేరేపించి తాండవమాడించి "నటరాజు" ని చేశావు!
సౌభాగ్య వతిగా (సంపదలకి అధిపతి అయిన లక్ష్మివి) విష్ణు మూర్తి తో కలిసి విశ్వ నిర్వహణ చేస్తూ అర్హత కలవారికి లేదనకుండా అందలమెక్కిస్తున్నావు! "యా దేవి సర్వ భూతేషు లక్ష్మి రూపేణ సంస్థితా..."
చదువుల తల్లివై సరస్వతిగా విధాత చేత కర్మ జీవుల నుదుటి రాత రాయిస్తున్నావు! విద్యాదేవతవై కవుల నాలుకపై నర్తించి, పండితులచే ఘంటం పట్టించి జ్ఞానాన్ని వెదజల్లే సహస్ర శీరుషవి నువ్వే కదా! చదువురాని వారిని, చదువు అంటని వారిని "సరస్వతి కటాక్షం" లేదనటం వింటూంటాం కదమ్మా!
"యా దేవి సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా..."
వన దేవతవై లోకాన్ని రంగు రంగుల పువ్వులతో, భిన్నమైన ఫల సంపదతో శోభాయమానంగా చెయ్యగల శక్తి నీకు కాక మరెవ్వరికుంది. స్త్రీత్వం లేని చెట్టు కాయలు కాయదని జగద్విదితమే కదా తల్లీ!
"గంగ", "కృష్ణ వేణి", "కావేరి", "గోదావరి", "నర్మద", "సరస్వతి" రూపంతో జల దేవతవై జీవుల దాహార్తిని తీరుస్తూ, భూమాతని సశ్య శ్యామలం చేస్తున్నావు.
భూమాతవై జీవులని మోస్తూ....వారి ఆగడాలు ఓర్పుగా భరిస్తూ... ఆహారాన్నందిస్తూ, బతకటానికి అవసరమైన ఖనిజాలని, లవణాలని నీ లోపలి పొరల్లోంచి అందించి బతికటానికి అవసరమైన వస్తు సంపదని సమకూరుస్తున్నావు.
"యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా"
సృష్టిలో ఇవన్నీ శక్తి స్వరూపమైన స్త్రీత్వ చిహ్నాలే కదమ్మా!
మాతృ మూర్తివై శిశువుని నీ గర్భంలో 9 నెలలు మోసి, శిశు జనన సమయంలో ప్రసవ వేదనతో పునర్జన్మ ని పొంది లోకవ్యాపారం కొనసాగటానికి అవసరమైన మానవ వనరులనందిస్తున్న నీ సేవ గురించి చెప్పటం ఏ కవితరం?
@@@@@
నీవే స్వయంగా ఘంటం పట్టి "మొల్ల"వై కావ్యాలు రాశావు.
కత్తిపట్టి "ఝాన్సి లక్ష్మి", "రుద్రమ దేవి" రూపంలో దుష్ట సంహారం చేశావు.
ధన్వంతరివై "ఆనంది బాయి జోషి" గా వైద్య సేవలందించావు.
మాతృమూర్తివై "జిజియా బాయి" గా శివాజి ని తీర్చి దిద్ది సామాజిక బాధ్యత నెరవేర్చావు. "మదర్ థెరిసా"వై స్వయంగా ఆర్తులని అక్కున చేర్చుకున్నావు.
"డొక్క సీతమ్మ" తల్లివై అన్నార్తుల ఆకలి తీర్చావు.
"కల్పన చావ్ల" వై అంతరిక్షంలోకి పయనించి ఆడవారి శక్తికి ఆకాశమే హద్దు అని నిరూపించావు.
"ఎమ్మెస్ సుబ్బలక్ష్మి" వై నీ గానంతో అలసిన హృదయాలకి సేద తీర్చావు.
"యామిని కృష్ణ మూర్తి", "శోభానాయుడు" వై ఆనంద తాండవం చేసి నటరాజ సేవ చేశావు.
లెఫ్టినెంట్ "శివాంగి" వై నౌకా దళ విభాగంలో సేవలందిస్తూ స్త్రీ శక్తికి పరిమితులు లేవని నిరూపించావు.
లెఫ్టినెంట్ జనరల్ "పునీత అరోర", లెఫ్టినెంట్ జనరల్ "మాధురి కనిత్కర్" కెప్టెన్ "స్వాతి సింగ్" వై రక్షక దళంలో నీ సత్తా చాటావు.
ఎయిర్ మార్షల్ "పద్మ బందోపాధ్యాయ్" వై వైమానిక దళంలో, సర్జన్ వైస్ ఎడ్మిరల్ "షీల ఎస్ మథై" వై నావికా దళంలో నీ సేవలు...ఇక్కడా అక్కడా అని లేకుండా ఆకాశమే హద్దుగా, నీ పట్టుదలే పెట్టుబడిగా మహిళల్లో స్ఫూర్తిని నింపుతూ ఆకాశంలో సగం "అతివ" అనే నానుడిని అక్షర సత్యం చేస్తున్న నీ శక్తిని వర్ణించటం, అంచనా కట్టటం ఎవరి తరం!!
"ఇందిర", "షేక్ హసీనా" "ఏంజిలా మెర్కెల్" వై దేశాలనే పరిపాలించ గలవు.
పారిశ్రామిక వేత్తవై సంపద సృష్టించగలవు.
సైంటిస్టువై అంతరిక్షంలోకి ఎగరగలవు! ఔషధాలు కనిపెట్టి ప్రాణ రక్షణ చెయ్యగలవు!
విద్యావేత్తవై భావి పౌరులని తీర్చి దిద్దగలవు!
ఇది అది అని చెప్పలేని నీ విస్తృతిని చెప్పటానికి నాకు తెలిసిన కొన్ని అక్షరాలని వాడుకున్నానమ్మా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి