*హనుమాన్ చాలీసా - చౌపాయి 17*
 *తుమ్హరో మంత్ర విభీషణ మానా!*
*లంకేశ్వరభయ  సబ  జగ  జానా!!*
తా: హనుమంతా! లంకేశ్వరుని సోదరుడు విభీషణుడు, నీవు ఇచ్చిన రామచంద్ర నామము అనే మంత్రాన్ని, నీవు ఇచ్చిన ఇతర సలహాలను నమ్ముకున్నాడు. అందువల్ల, విభీషణుడు, తానే లంకకు రాజు అయ్యాడు, అనే విషయం ప్రపంచం మొత్తం తెలుసుకుంది.......అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం:  సలహా అందరూ ఇవ్వవచ్చు, ఎవరికైనా. కానీ, సలహా ఇచ్చిన వ్యక్తి, వ్యక్తిత్వం మీద, ఆ సలహా విలువ ఆధార పడి ఉంటుంది. ఇక్కడ సలహా ఇచ్చింది, భరత సమానుడు, సుగ్రీవుని మంత్రి. ఇక ఈ మహానుభావుడు ఇచ్చిన సలహా ఇంకెంత గొప్పగా ఉంటుంది అని ఒప్పుకుని,  ఏ కొంచెం కూడా ఆలోచించ కుండా, చక్కగా అనుసరించి, ఆచరించాడు, విభీషణుడు. అతి చక్కని ఫలితాన్ని అందుకున్నాడు. మనం కూడా, ఎవరైనా సలహా ఇస్తే, సలహా ఇచ్చిన వారి స్థాయి, నడత, తెలుసుకుని, మన ఆలోచనలకు పని పెట్టకుండా, నమ్మకం తో ఆచరిస్తే, తప్పక విజయం మన సొంతం అవుతుంది. ఇటువంటి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు మనకు తారసపడాలని, ఆ సలహాలను నమ్మికతో ఆచరించే మంచి మనసు, తెలివితేటలు మనకు అందించమని........ రాజీవలోచనుడు, రఘుపుంగవుడు అయిన రామచంద్రమూర్తిని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు