*శ్రీ శోభకృత, వైశాఖ బహుళ దశమీ, ఆదివారం - 14.05.2023, హనుమజ్జయంతి శుభాకాంక్షలతో*
*మహావీర విక్రమ బజరంగీ!*
*కుమతి నివార సుమతి కే సంగీ!!*
తా: ఆంజనేయా! బజరంగీ అని పిలవబడే నీవు మహారుడివి. పరాక్రమానికి రూపము నీవు. చెడు బుద్ధులను, ఆలోచనలను తొలగింప చేస్తావు. మంచి ఆలోచనలతో ఉన్న వారికి చేదోడు వాదోడుగా ఉంటావు........అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: హనుమ పరాక్రమం మనకు వేయి యోజనాల సముద్రం దాటుతున్నపుడు పరిచయం అవుతుంది. ఇక అంజనీ సుతుని వీరత్వం, అశోకవనాన్ని నాశనం చేస్తూ, కొన్న వేల మంది రాక్షసులను, రావణ కుమారుని మట్టు పెట్టినప్పుడు పరిచయం అవుతుంది. ఈ వాయుసుతుని పేరు తలచుకుంటేనే, మానవులుగా మనకు కలిగే ఎన్నో భయాలు పటాపంచలు అవుతాయి. మనకు తెలియ కుండానే మన శరీరం పులకించి పోయి, అసమానమైన ధైర్యం మన సొంతం అవుతుంది. ఎలా అంటే, అప్పుడే అడుగులు వేయడం నేర్చుకున్న చిన్నారి పక్కన తన తల్లో, తండ్రో ఉన్నప్పుడు ఆ చిన్నారికి కలిగే ధైర్యం లాంటిది. ఇటువంటి ఆత్మస్థైర్యం, జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులను తట్టుకుని ముందుకు సాగే వీరత్వం మన అందరికీ అనుగ్రహించాలని.........ఆంజనేయుని తలపులలో నిత్యం కొలువున్న రామచంద్ర మూర్తిని వేడుకుందాము.*
*ఆఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి