నరేంద్రుడు!! ప్రతాప్ కౌటిళ్యా
ఒకప్పుడు
వాడికి గాలి ఎదురు తిరిగింది!!

మట్టి గట్టిగా తొక్కి పట్టింది!!

ప్రతి నోరు
నీరులా నిలువునా ముంచింది!!

నడుద్దాం అన్న అడుగులు అడ్డుకున్నారు.
ఎగురుదామన్నా రెక్కలు నరికేశారు!!

దిగంబరంగా చేసి దిగ్భందించారు!!

ఆకాశము ఆదుకోలేదు
భూమి అవకాశం ఇవ్వలేదు!

సంసారం సాగరంలో కలిసింది
నమస్కరించిన నావ 
నడి సముద్రంలో మిగిలింది!!

సుడిగుండాలు ఒకవైపు
తుఫానులు ఒకవైపు
ఉరుములు మెరుపులు
దినదిన గండాలు!!! కానీ కానీ

అతడి ఇప్పుడు ఎవడో కాదు
నరేంద్రుడు ఇంద్రుడు నా మిత్రుడు!!?

చెట్టు ఒకటి పువ్వు ఇచ్చింది
జత కట్టింది కాయలు కాసింది
పలమిచ్చిందీ!!

ఆ ఫలాలు సముద్రాలు దాటాయి
ఆకాశంలో ఎగిరినవి అమెరికాలో ఆగినవి.!!

ఇండియాలో ఎగిరిన పక్షి
ఇప్పుడు ఈగలైందీ.!!?

పగలు రాత్రులు లేవు ఇప్పుడు
కలలు నిజమైనవి
సమయము లేదు ఇప్పుడు
కలలు కనడానికి!!!!?

అతడిప్పుడు ఎవడో కాదు
నా మిత్రుడు వివేకానందుడు
వివేకము వికాసము అతని ఆస్తి!!!
శ్రావణి స్వప్న శృతి అతని సంస్కారం!!

గుండె బలం కండబలం కాదు
బుద్ధి బలం అతనికి!!

పేదరికం పై యుద్ధం
చదువే అతని ఆయుధం!!!

అందరూ గెలుస్తారు!
నరేంద్రుడు జీవిస్తాడు!
అందరినీ గెలిపిస్తాడు!!

బాల్య స్నేహితుడు డాక్టర్ నరేందర్ కు ఒక కానుక, ఈ కవిత.

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు
Popular posts