పంచపది,; -కలం పాశుపతం!- కవిత్వం పారిజాతం!;- డా. పి.వి.ఎల్. సుబ్బారావు, 94410 58797.
నా పంచ పదుల సంఖ్య--

863.
తండ్రి హలం, తల్లి గృహం, తనయుడు కలాన బలము! 

ప్రాథమిక విద్య గ్రామాన,
 వీధి బడే అవకాశము !

హరికథ,జానపదం, జంగ కథ, నిజశ్రవణము!

 ఉర్దూమాధ్యమం బి.ఏ. వరకు, సాగిన విద్యాభ్యాసము! 

తెలుగు సాహిత్యాన పి.జి,, డాక్టరేట్ స్వీకరణము, పివిఎల్!

864. 
ఆయన వదనం కవితా సదనం,
         రూపం మోహనము!
 
ఉపన్యాసం, వచోవిన్యాసం,   
      శ్రోతలకు రసోల్లాసము!
 
అక్షరాలకు రెక్కలొచ్చి,
   పదాలు చుక్కల లోకము! 

భావాల గంధాలు, "కవి"తల్లో,  
         భద్రపరిచే నైజము!
 
సినారే హుషారు భళారే, మరలమరలా వినాలే,పివిఎల్!

865.
అధ్యాపకుడు, ఆచార్యుడు, సంపాదకుడు ,చతురుడు! 

అ.భా.సం.అధ్యక్షుడు,
రాజ్యసభసభ్యుడుఅయినాడు!
 
సాహిత్యాన ఓ బహుముఖ, సృజనా శక్తి సంపన్నుడు!

 పెక్కు దేశాలు పర్యటించాడు, ప్రాతినిధ్యం వహించాడు! 

ప్రామాణిక పరిశోధనా గ్రంథం, అందించిన ఘనుడు, పివిఎల్ !

866.
వారి రచనలన్నీ చక్కగా, అష్టాదశ సంపుటాలు !

రచనలన్నీ శ్రోతల పాలిట, నవరసోపేతాలు!

" నన్ను దోచుకుందువటే", హృదయాలు దోచిన పాటలు! 

మూడువేల సినిమాల,   
      శ్రోతలకు తేనెల ఊటలు! 

సినారే కలం, గాయక గళం, చిత్రాల సంచలనము,పివిఎల్!

867.
ఆంధ్రా,కేంద్రాల సాహిత్య, అకాడమీల పురస్కారము! 

అసాన్, రాజ్యలక్ష్మి,
       పద్మవిభూషణ్ ల,
                పురస్కారము!
 
సోవియట్-నెహ్రు ,
         భా.భా. పరిషత్ ల   
               పురస్కారము!

 ఉత్తమ పాటల రచయిత,
 తె.వి.వి. పురస్కారము! 

గౌ.డాక్టరేట్లు, 
ప్రతిష్టాత్మకం జ్ఞానపీఠం, తనవాయె, పివిఎల్!
________


కామెంట్‌లు