పంచపది,;- కమ్యూ"నిజ" పాదు.;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు,94410 58797.
 నా పంచపదుల సంఖ్య---
868.
భారతదేశ చరిత్రలోనే, 
గొప్ప కమ్యూనిస్టు నేత !
సాంఘిక మార్క్స్ వాద. సూత్రమే ఆయన నమ్మిన గీత !
విప్లవ వాదాన్ని ఆసరాగా, తీసుకున్న రచయిత!
చరిత్రకారుడు ,విమర్శకుడిగా, చక్కని యోగ్యత !
కేరళ రాష్ట్ర కాంగ్రెసేతర, ముఖ్యమంత్రిగా ఘనత, పివిఎల్!
869.
కులవివక్ష సాంప్రదాయానికి, సదా వ్యతిరేకము !
భూసంస్కరణ,విద్యాసంస్కరణ 
నిజ అనుకూలము!
మార్క్స్ వాద ఆచరణ సమితి, దీర్ఘ సభ్యత్వము!
నిర్ణయాలచొరవ,
    ముందుచూపు అడుగు,
                 ప్రత్యేకము!
కేరళ చరిత్ర పుస్తకం నేడూ ,
బహుళ ప్రాచుర్యము, పివిఎల్!
870.
సామ్యవాద సిద్ధాంతాల, అచంచల ఘనవిశ్వాసము! 
కమ్యూనిస్టు ఉద్యమాల,
 ప్రాణం పోసిన నాయకత్వము! 
సిద్ధాంతానికి కట్టుబడిన, రాజకీయ జీవితము!
 నాస్తికుడైన ఆయన ఆస్తి, సాధారణ జీవనము!
 
ఆయన నాయకత్వానికి,
కేరళాభివృద్ధే అద్దము,పివిఎల్!
________


కామెంట్‌లు