విశ్వశాంతి కాముకులు.. బ్రాహ్మణులు! "కవిమిత్ర" శంకర ప్రియ., శీల., 99127 67098
 ⚜️బ్రహ్మజ్ఞానo కలవారు
 రెండుజన్మ లైనవారు
      బ్రాహ్మణులే భూసురులు!
 ఓ సుమతీ! ఓజోవతి! (1)
⚜️ విశ్వశాంతి కాముకులు
 ప్రగతి రథచక్రాలు
     బ్రాహ్మణులే భూదేవులు!
 ఓ సుమతీ! ఓజోవతి! (2)
       (..అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🔆బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు! వారు.. తమజ్ఞానముతో.. విశ్వశాంతినే కోరుకొను చున్నారు! అద్వైతం.. ద్వైతం.. విశిష్టాద్వైతo... మున్నగు సిద్ధాంతములే... మన ఆర్ష విజ్ఞాన సర్వస్వం! కర్మ, భక్తి, జ్ఞానo, విజ్ఞానం, ధర్మo, శక్తి, యుక్తి, బుద్ధి, కౌశలం, చదువు, సంస్కార బలం కల్గిన వారందరూ.. బ్రాహ్మణులే!
🪷బ్రాహ్మణులు.. బ్రహ్మ వర్చస్సు చేత, భూమండలo నందు ప్రకాశించువారు! కనుక, భూదేవులు! దేవతలనగా క్రీడించు వారు! ఐశ్వర్య యుక్తులే.. సురులు! వారి ధర్మమే వేదము! వారి నిత్య కర్మానుష్ఠానమే గాయత్రీ, సూర్య ఉపాసనము! వారి జీవనమే త్యాగము! వారి దృష్టియే సమతా భావము!
🔆బ్రాహ్మణ దర్శనమే.. సర్వ మంగళకరము! వారి ఆశీర్వాదమే.. సమస్త సుఖ వైభవ ప్రాప్తి! వారి కృపయే ..భవసాగర తరణము! బ్రాహ్మణ జాతియే సంకట హరణము! బ్రాహ్మణ సమైక్యతయే సర్వ శక్తివంతము!
🪷బ్రాహ్మణో మమ దేవతా!
        🚩ఉత్పల మాల పద్యము
      బ్రాహ్మణమూలమై, జగతి వర్ధిలుచున్నది శ్రేయమొప్పగన్
      బ్రాహ్మణధర్మమే, భువికి భాగ్యములిచ్చును సర్వవేళలన్;
      బ్రాహ్మణ ధర్మ కర్మములు, రాజిలుచున్నవి విశ్వమంతటన్
      బ్రాహ్మణుడే వరేణ్య గుణభాసితుడై, వెలుగొందు నిత్యమున్!!
      ( రచన: డా. అయాచితం నటేశ్వర శర్మ.,)

కామెంట్‌లు