ధర్మ శాసన కర్తలు "కవి మిత్ర" శంకర ప్రియ., సంచార వాణి: 99127 67098
 🔆ధర్మ స్వరూపుడు నంది
జీవునకు ప్రతినిథి 
     శివుని వాహన మూర్తి!
ఓ సుమతీ,! ఓజోవతి! (1)
🔆 ధర్మ శాసన కర్తలు
జగత్పరి పాలకులు
     నంది శివు లిరువురు
ఓ సుమతీ,! ఓజోవతి! (2)
 ⚜️భారత జాతి రాజదండం... న్యాయమునకు ధర్మమునకు ప్రతీక! ధర్మ స్వరూపుడైన నందీశ్వరుడు; ఆ నందీశ్వరుని వాహనముగా కల్గియున్న, సాంబసదా శివుడు.. ధర్మ శాసన కర్తలు!
     రాజ దండము.. ఐదు అడుగులు పొడవు తో; పై భాగంలో "ధర్మ మూర్తి యైన నంది" చిహ్నమును కలిగి యుంటుంది! ఆ రాజదండమును తమిళంలో.."సెంగోల్" అంటారు! తమిళ పదమైన సెమ్మాయ్‌ (ధర్మం) నుంచి వచ్చింది! 
 🚩 కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ వేడుకలో.. ది.28- 05 - 20 23వ. తేదీని.. మన ప్రియతమ భారతప్రధాని, మాన్యశ్రీ మోదీ మహాశయుడు.. బంగారు రాజదండమును.. లోక్ సభాపతి సమీపంలో ఆవిష్కరించారు!
     బ్రిటిషర్లు, భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనము!
👌పూర్వ గాథ: తమిళ సంప్రదాయం లో.. కొత్త మహారాజు బాధ్యతలు చేపట్టే సమయంలో; ఈ రాజదండం అందజేస్తారు! దానిని, చోళ మహా రాజులు నుంచి పరిపాలకులు అనుసరించు చున్నారు!
     మన భారత దేశం యొక్క రాజదండం చరిత్ర, ప్రాధాన్యత ...ఈనాటి నవతరం తప్పకుండా తెలుసుకోవాలి! ఆ విధంగా మన సంప్రదాయాలను, ఆధునికతకు సంధానించే ప్రయత్నo; మనమంతా తప్పకుండా చేయాలి!
       "జై హింద్! జై భారత మాత!!" 
         🚩సీస పద్యము  
   అద్వితీయమ్మౌచు ఐదడుగులు గల  
"రాజ దండము" శిష్ట రక్ష నొసగు !  
   తలమీద నందిని ధరియించి తుల వలె,
 "రాజ దండము" ధర్మ రక్ష నొసగు!     
      భారతావనిలోన భవ్యమో నీతికి,    
"రాజ దండము" న్యాయ రక్ష నొసగు!    
     కల్మషముల నెల్ల కడిగి పారగ ద్రోసి,
"రాజ దండ" మవని రక్ష చేయు! 
         ( 🚩 తేట గీతి పద్యము )
      శివుడె సర్వ శాసన కర్త! శివుని భృత్య   
     వరుడు, ధర్మ స్వరూపుండు, బసవ విభుడు !     
     ధర్మ శాసన రూపులై తనరి, వారు
   "రాజ దండావతారు" లై రాజ్యమేలె !
   ( కళారత్న డా. మీగడ రామలింగ స్వామి.,)

కామెంట్‌లు