బ్రహ్మ, నారద సంవాదంలో.....
శ్రీకృష్ణుడు బాణుని భుజములు ఖండించుట - తలను ఖండించ బోవ, శంభుడు ఆపుట - శ్రీకృష్ణుని ద్వారక ప్రయాణము - తాండౌనృతగయము చేసి బాణుడు శంకరుని అనుగ్రహము పొందుట - మహాకాలతత్వప్రాప్తి కలుగుట.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*జృంభణాస్త్రముతో శంకరుడు మూర్ఛిల్లిన తరువాత, కృష్ణుడు, తన శస్త్రాస్త్రములతో బాణుని మీదకు యుద్ధానికి వెళతాడు. బలి చక్రవర్తి కుమారుడైన బాణుడు, కుంభాండుని రధసారిధ్యంలో శ్రీకృష్ణుని తో యుద్ధానికి వచ్చాడు. వారిద్దరి మధ్య చాలాకాలం వరకు భీకరమైన యద్ధం జరిగింది. జరుగుతున్నది, శివ తత్వము, శివ భక్తుల మధ్య మహాయుద్ధం. శ్రీకృష్ణడు శివుని ఆంశ. బాణుడు పరమ శివభక్తుడు. అనంతంగా జరిగే యుద్ధంలా కనబడుతున్న సమయంలో, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రమును వదలి బాణుని అనేక భుజాలను ఏక కాలంలో ఖండిస్తాడు. బాణునికి తన అందమైన నాలుగు భుజములు మిగిలి ఉన్నాయి. అపార శివ భక్తి కారణంగా ఆతని బాధ తొలగిపోయింది. అలాగే, స్మరణ శక్తి కూడా పోయింది. కృష్ణుడు, బాణుని తల నరకడానికి, తయారు అవుతుండగా, శంకరుడు మాయా మూర్ఛ నుండి మేలుకుంటారు. బాణును మీదకు ఉరుకుతున్న కృష్ణుని చాచి ఇలా పలికారు.*
*"దేవకీనందనా! నీవు ఎప్పుడూ నా ఆజ్ఞకు లోబడే ఉన్నవు. ఇంతకు ముందు దధీచి, రావణుడు, బాణాసురుడు వంటి వారి మీద కూడా నీవు నా ఆజ్ఞ లేకపోవడం వల్ల, నీ చక్రప్రయోగము చేయలేదు. నీవు ఎప్పుడూ, యోగీశ్వరుడవు. పరమాత్ముడవు. ప్రాణులు అందరికీ మేలు చేస్తూ ఉంటావు. పూర్వ కాలంలో ఈ బాణుడు, తన భుజ గర్వం చూపుతూ నాతో యుద్ధం కోరుకున్నాడు. అప్పుడు నీ భుజ గర్వంపోగొట్టే వాడు నీ దగ్గరకు వచ్చి నీ గర్వం పోగొడతాడు, అని వరమిచ్చాను. ఇప్పుడు బాణుని భుజములు తోలగించి అతనికి గర్వ భంగం కలిగించావు. బాణుడు, నా పరమ భక్తుడు. కావున, అతనికి మృత్యు దండన ఇవ్వ వద్దు. నీ సుదర్శనాన్ని ఉపసంహరించు. యుద్ధము ఆపేసి, వధూవరులను తీసుకుని ద్వారకకు వెళ్ళి , సుఖంగా ఉండండి. బాణా!, కృష్ణుడు నేను నీకు ఇచ్చిన వరాన్ని పూర్తి చేసాడు, కనుక ఆయనతో నీవు శతృత్వం పెట్టుకోకుండా, నీకుమార్తెను అప్పగించు", అని శ్రీకృష్ణ బాణు లకు స్నేహం కలిపారు శంకరులు.*
*శంకరుని ఆజ్ఞ మేరకు సుదర్శనమును వెనుకకు పిలిచి యుద్ధం ఆపివేసారు, కృష్ణ పరమాత్మ. బాణుడు, కృష్ణుని తన మందిరానికి తీసుకు వెళ్ళి, ఉషా అనిరుద్ధులను అప్పగించి, మణి మాణిక్యాలతో సత్కరించి, విందు భోజనాలు ఇచ్చి, ద్వారకకు పంపుతాడు, బాణుడు. ఉష స్నేహితురాలు, పరమయోగిని అయిన చిత్రలేఖ తో కూడి ద్వారకకు చేరిన కృష్ణుడు, బంధు మిత్రులు, కుంటుంబం తో కలసి సుఖంగా ఉన్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి