బ్రహ్మ, నారద సంవాదంలో.....
గజాసురుని తపస్సు - అత్యాచారములు - శివుని దండన - గజాసురుని ప్రార్థన - శంభుడు కృత్తివాసుడు అవడం - కృత్తివాసేశ్వర లింగ స్థాపన.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*గజాసురుడు, మహిషాసురుని కుమారుడు. చాలా శక్తివంతుడు. శత్రుంజయుడు. కానీ, తన తండ్రి మీద కోపముతో దేవతలు అందరూ ప్రేరేపించడం వలన, అమ్మ దేవి చంపింది అని తెలుసుకుని, చాలా బాధపడ్డాడు. ఆ బాధ నుండి, గజాసురునికి దేవతల మీద శత్రు భావము పెరిగి, వారిని జయించడానికి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు వలన అతని శరీరము నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు బయటకు వచ్చి, మూడు లోకాలను దహించి వేస్తున్నాయి. అప్పుడు, దేవతలు, బ్రహ్మ నైన నా వద్దకు వచ్చి, ఆతని వల్ల కలుగుతున్న బాధలను ఇంక భరించ లేమని, తామందరినీ కాపాడమని, వేడుకున్నారు. అప్పుడు, నేను వారిని ఊరడించి, గజాసురుని వద్ద కనిపించి నీ కోరిక తీరుస్తాను, చెప్పు అని అడిగాను. గజాసురుడు తనకు, కామదేవుని చేత బాధింపబడిన ఏ స్త్రీ చేతిలో గానీ, పురుషుని చేతిలో గానీ చావు రాకుండా వరము ఇమ్మాన్నాడు. "తథాస్తు" అన్నాడు బ్రహ్మ.*
*బ్రహ్మ ఇచ్చిన వర గర్వంతో తనకు మృత్యువు రాదు అని నమ్మి, మూడు లోకాల మీదికి యుద్ధానికి వెళ్ళి వారినందరిని జయించి, తన సేవకులను చేసుకున్నాడు. దిక్పాలకులను జయించాడు. దేవతలను, మునులను, ఋషులను అనేక విధాలుగా బాధలు పెడుతున్నాడు. చివరకు శంకరభగవానుని రాజధాని, ఆనందవనము గా పిలువబడే, కాశీ పట్టణం లో ఉన్న అందరినీ కూడా బాధిస్తున్నాడు. గజాసురుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ, శంభుని వద్దకు చేరి గజాసురుడు చేస్తున్న పనులు, పెడుతున్న బాధలు చెప్పి తమను కాపాడమని మొర పెట్టుకున్నారు. మహేశుడు, కామ విజయుడు కదా. అందువల్ల, గజాసురుని తో యుద్ధంలో ఆతనిని అడ్డుకుని, త్రశూల ప్రయోగంతో గజాసురుని సంహరిస్తారు, చంద్రచూడుడు. త్రిశూలము దిగబడిన గజాసురుడు, హిమనగాధీశుని అనేక విధాలుగా కీర్తిస్తాడు.*
*"మహేశానా! గౌరీపతీ! నా శరీరము అనంతమైన పుణ్యం చేసుకుంది. అందువల్లనే, నీ త్రిశూలము నన్ను తాకింది. మీరు నాయందు ప్రసన్నం అయితే, ఈ పుణ్య శరీరాన్ని ఎల్లవేళలా ధరించండి. ఈ క్షణము నుండి మీరు, కృత్తివాసుడుగా పిలువబడాలి" అని కోరుకున్నాడు. భక్త సులభుడు అయిన గంగాధరుడు, "అట్లే అగుగాక" అని చెప్పి, గజాసురుని చర్మాన్ని ధరిస్తారు. గజాసురుని శరీరము కాశీలో, లింగరూపమున ఉండి, "కృత్తివాశేశ్వరుడు" పిలవబడుతోంది. అన్ని లింగాకారములలో, ఈ కృత్తివాసేశ్వరుని లింగము గొప్పదిగా, శంభుడు చెప్పారు. దిగంబరుడు అయిన శివుడు గజాసుర చర్మాన్ని కప్పుకుని కైలాస నికి ప్రయాణం సాగించారు. గజాసుర మరణంతో కాశి పట్టణ ప్రజలు దీపావళి జరుపుకున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి