106.ఆ.వె.మార్గ శీర్ష మందు మదిలోశిరమువంచిగంగ లోన మునిగి గట్టు పైనస్వార్థ భావ మొదిలి స్వామి సేవకు రండిసౌమ్య గుణము విడక సాగవలయు !!107.ఆ.వె.మార్గ మాఘ మధ్య మార్తాండుడుదిశనుమార్వ సూర్య రథము మహిమ జూపుతీర్థ యాత్ర లందు తీర్చుకోఋణములుసౌమ్య గుణము విడక సాగవలయు!!108.ఆ.వె.గంగ శక్తులు మునుగంగ గోచరములుజీవ నదిగ వలన జేయు మేలురోగపాపములను రూపుమాపునిలలోసౌమ్య గుణము విడక సాగవలయు!!109.ఆ.వె.వడివడిగ చినుకుల వానలు కురియగపదపద మని జనులు పరుగులిడిరిపల్లపు పొలములను పండించ సుజనులుసౌమ్య గుణము విడక సాగవలయు!!110.ఆ.వె.వినయములుగలిగి సహకారములుజేసిమాట లాడు నపుడు మాన్యుడుగనునిలిచి మనసు పెట్టి నిలువుమా మహిలోనసౌమ్య గుణము విడక సాగవలయు!!!(ఇంకా ఉన్నాయి)
సౌమ్య గుణము (పద్యములు);- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్-9440522864.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి