ఏ.పి. జే..అబ్దుల్ కలామ్..
వర్ధంతి సందర్భంగా...
-----------------------------
అవుల్ పకీర్ జైనాలబ్దీన్ అబ్దుల్ కలాం గారు ..
రామేశ్వరం రత్నం
ఇస్లాంలో పుట్టిన భరతమాత ముద్దుబిడ్డ
భగవద్గీత ను అవసోపన పట్టిన నవాబ్
భారతావనికి అంతరిక్ష పాఠాలు నేర్పిన జనాబ్.
విశ్వ శాంతికై వదిలిన మిస్సైల్
ఆధునిక భారతావనికి వన్నెలద్దిన
అంతరిక్ష సైనికుడు
11 వ రాష్ట్రపతిగా ప్రజల మన్ననలు పొందిన ధీరుడు.
విద్యార్థులకు కలల రాకుమారుడు..
యువకులకు ఉత్ప్రేరకుడు..
శాస్త్ర వేత్తలకు మార్గదర్శి..
రాజకీయ నాయకులకు ప్రీతి పాత్రుడు..
ప్రపంచ దేశాలకు కలాం ఒక కలల రేడు.
ఆయనకు (మాజీ)రాష్ట్రపతిగా పిలిపించుకోవడం కన్న
గురువుగానే గుర్తించడం మిన్న.
ఆయనకు భారత రత్న కన్న
భారతావనిలో జన్మించడం మిన్న
ఆయన ఆస్తి భారత యశస్సు
ఆయన ఆస్తి..సాధించిన కీర్తి
అయన బంధువులు భారతీయులు
ఆయన గుర్తులు సదా జ్ఞాపకాలు
ఆయన మరణం సదా స్మరణీయం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి