చిత్తరువైన మానవ జాతి
మానవత్వం కరువైన
జనారణ్యం.....
ఆక్రందనలకూ కరగని
కర్కశత్వం......
అభ్యర్థనలకూ కరగని
పాశవికత్వం ....
ఎందుకీ తరతమ బేధాలు?
ఎక్కడుంది లౌకిక వాదం?
ఎక్కడుంది సమసమానత్వం?
మగాళ్లు మృగాలైన వేళ
వేటగాళ్లై వెంటాడుతుంటె,
జింకను వేటాడే
పెద్దపులిలోకూడా
మానవత్వాన్నే చూసే మహిళలు
అమ్మ మనసుతో గెలవాలనే
అమాయకులు.....
నిశ్శబ్ద నిశీధిలో నిస్సత్తువై
రోధించిన వేళ
అందమైన ,అమాయకమైన
మహిళలు......!
ఇది జనారణ్యమా?
మృగారణ్యమా.
ఇదే మహిళా లోకానికి
కావాలి మేలుకొలుపు!
మరే అతివా కాకూడదు
బలిపశువు..
సౌభ్రాతృత్వమే మన నినాదంగా
మారండి ..మారండి ...
ఇకనయినా మారండి ...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి