అది ఒక దివ్యక్షేత్రం. వనదుర్గ వెలిసినట్టి పుణ్యక్షేత్రం. "మంజీర" నామమున గంగ సప్తశాఖలై వరలిన వరిష్ఠక్షేత్రం. జనమేజయ సర్పయాగ కారణాన సర్పకోటి బూడిద కుప్పలైన ప్రదేశం. సప్తమహర్షుల ఆనతిపై గరుడుడు గంగను సర్పకోటి బూదికుప్పలపైనుండి ఏడుపాయలై ప్రవహింపుమని కోరగా జలజలమను దివ్యనాదభరితమై మంజీరగంగ పారినంత సర్పకోటికి పుణ్యలోకప్రాప్తి కలిగిన దివ్యభూమి. అభ్రగపతి పేరున "గరుడగంగ" నామము గల మహిమాన్విత పుణ్యతీర్థం.
నాటి చరితను నేటికినీ తలపోసే మంజీరా తోయమాలికలున్న మహాక్షేత్రం. ఎందరో ఋషుల తపస్సులకు ఆలవాలమై, ఎందరో కవుల కైతలకు ఆలంబనమై, సద్భక్తజనావళికి సులభ ముక్తిధామమై, మన అందరి కోరికలీడేర్చే కొంగుబంగారమై ఇలవెలిసిన మహాశక్తి క్షేత్రం !!!
++++++++++++++++++++++++

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి