త - ఒత్తు; -ఎం. వి. ఉమాదేవి
 త - ఒత్తు సంయుక్తాక్షర పదాలతో బాల సాహిత్యం
================================ 
సంయుక్త అక్షరం తా వత్తు సాధనలు 
యుక్తమౌ గేయాన వ్రాస్తున్న సమయమే

గుర్తేమి రాలేదు వర్తులముగా జూడ
నర్తనము నామదిని కర్తగా జేయుచును

అగడ్తలె యగునుమరి పొగడ్తలు మనపాలి!
ప్రవర్తన బాగున్న  వార్తలలొ నిలిచేరు!

వస్తువుల కంటేను వాసి స్నేహం గొప్ప
దుస్తులతో గౌరవం మస్తుగా పెరుగును

భక్తివిషయం వినుచు రక్తి కట్టెను సభయే
యుక్తమౌ భాషతో వక్తగా విజయాలు!

కామెంట్‌లు