శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....
సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు - ఐదు శివరూపముల అవతారముల వర్ణన........
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*
*నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:
*1."సద్యోజాతుడు" : కల్పములు, మహాకల్పములలో, పందొమ్మిదవ కల్పము "శ్వేతలోహితము" అనే పేరుతో బాగా ప్రసిద్ధి పొందింది. ఈ "శ్వేతలోహిత" కల్పములో సదాశివుడు "సద్యోజాతుడు" గా అవతరించారు. ఇది ఆ స్వామి మొదటి అవతారముగా చెప్పబడింది.*
*శ్వేతలోహిత కల్పములో బ్రహ్మ, పరమేశ్వరుడు, పరాత్పరుడు అయిన పరబ్రహ్మము గురించీ తపస్సు లో ఉంటూ ధ్యానము చేస్తున్నాడు. అప్పుడు తెల్లని లోహపు రంగులో శిఖ (పిలక) ఉన్న ఒక బాలుడు పుట్టాడు. ఆ పిల్లవాడు దివ్యమైన వెలుగు వెదజల్లుతున్నాడు. ఆ బాలుని చూసిన బ్రహ్మ, ఈ బాలుడు శివుడే అని గుర్తించి, సాష్టాంగ నమస్కారం చేసి, అనేక విధాల కీర్తనలు చేసాడు. ఈతడే"సద్యోజాత" కుమారుడు. ఈ బాలుడు శంకరుని గా తెలిసిన తరువాత, బ్రహ్మ ఇంకా పరమేశ్వరుని గురించి ఆలోచిస్తూ ధ్యానం లో ఉండగానే, జ్ఞాన సంపన్నులు, పరబ్రహ్మ స్వరూపులూ అయిన సునందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందనుడు అనే నలుగురు కుమారులు పుట్టి బ్రహ్మ కు శిష్యరికం చేసారు. సద్యోజాతుడు గా వచ్చిన పిల్లవాడు, బ్రహ్మ కు జ్ఞానమును, సృష్టి రచనా సామర్ధ్యమును ఇచ్చాడు. ఈ "సద్యోజాతుడు" పరమశివుని మొదటి అవతారము.*
*2. "వామదేవుడు" : శ్వేతలోహిత కల్పము తరువాత "రక్త" మను పేరుతో ప్రసిద్ధి చెందినది ఇరవైయవ కల్పము. ఈ "రక్త" కల్పములో బ్రహ్మ దేవుడు రక్తపు రంగులో ఎర్రని శరీరము కలవాడిగా ఉండి, తనకు కుమారుని ఇవ్వమని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండగా ఆ స్వామి నుండి ఎర్రని రంగులో మాలలు, వస్త్రాలు, ధరించిన బాలుడు వెలువడ్డాడు. ఆ బాలుని కన్నులు కూడా ఎర్రగా అందంగా ఉన్నాయి. ఆ బాలుడు ధరించిన ఆభరణాలు కూడా ఎర్ర రంగు లోనే ఉండి, ఆత్మబల సంపన్నుడుగా ఉన్న వాడు "ఈతడు ఎవరు" అని బ్రహ్మ దేవుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఎర్రని రంగు లో, అమేయమైన బల సంపదతో ఉన్న బాలుడు, "వామదేవుడు" అయిన శివుడే అని తెలుసు కున్నాడు. "వామదేవుని తరువాత, వరుసగా, విరజా, వివాహ, విశోక, విశ్వభావన అనే నలుగురు కుమారులు వచ్చారు. వారందరూ ఎర్రని బట్టలతో జగజ్జేయమానంగా వెలిగి పోతున్నారు. "వామదేవ" రూపంలో పరమేశ్వరుడు బ్రహ్మ ను అనుగ్రహించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి