1.
పింగళి వెంకయ్యా, పాదాభివందనమయ్యా!
జాతీయ పతాక రూపకల్పన, చేసిన ఘనుడవయ్యా!
త్రివర్ణాలలో త్రిగుణాలు ,,
చక్కగా పొదిగినావయ్యా!
కాషాయం-త్యాగం ,
దవళం-శాంతం ,
హరితం -పచ్చదనం!
"ధర్మచక్రం"
శాంతిస్థాపనలో సుదర్శనం!
భువిలో కీర్తికాయుడా,
దివికేగీన పుణ్యచరితుడా!
భారతీయ హృదయ,
ఆరామాల ఆరాధ్యుడా!
2.
జెండా పండుగ మన,
ఘన జాతీయ పండుగ !
దేశమంతా ప్రతి ఒక్కరిలో, ఉత్సాహం పండించగా!
ఢిల్లీ ఎర్రకోట పై ,
ప్రధాన మంత్రులు !
రాష్ట్ర రాజధానులలో,
ముఖ్యమంత్రులు!
నగరాలలో గ్రామాలలో,
డెబ్బది ఐదు వత్సరాలుగా !
ఎగరేసిన జెండా, వినువీధులలో విహరించగా!
దివినున్న అమరవీరులను,
ఆప్యాయంగా పలకరించగా!
వారు పరవసులై , ప్రతిఏటా,
సంబరాలు తిలకించగా !
తమ ఆశయం సిద్ధించిందని,
ఎంతో పులకించగా!
3. పౌరులందరూ ,జెండాలు,
చేతపట్టి నడవగా!
వందేమాతరం అని,
నినదించగా!
దేశభక్తి గీతాలాపనలో,
తన్మయం చెందగా!
దేశమంతా దేశభక్తి,
ప్రతిధ్వనించగా !
పరాయి పాలన స్వస్తి ,
స్వపరిపాలన దీప్తి!
4.
జనగణాల వందన,
జాతీయ చిహ్నం !
చేద్దాం, జండా ప్రతిష్టకై ,
భీష్మ శపథం!
నడుద్దాం, అందరం,
దేశ నిర్మాణ పదం !
మన జెండా మన సన్మాన్,
శౌర్య నిషాన్, ధైర్య ప్రధాన్!
_________
స్వాతంత్య్ర సమర, విజయ సూచిక!;- డా.పి వి ఎల్.సుబ్బారావు. విజయనగరం.94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి